ఉపరాష్టపతి రేసులో ఓబీసీ మహిళా నేత?

Publish Date:Aug 12, 2025

Advertisement

జగదీప్ ధన్‌కఢ్ ఆకస్మిక రాజీనామాతో అనివార్యమైన భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం  (ఆగష్టు 8) విడుదల చేసింది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంరంభ మైంది. నామినేషన్ల స్వీకరణ గడువు ఆగష్టు 21తో ముగుస్తుంది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరుగుతుంది. అదే రోజున వోట్ల లెక్కింపు జరుగుతంది  కాగా..  ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలెక్టోరల్ కాలేజీని  కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్దం చేసింది. 

ఈ నేపథ్యంలో కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్త మవుతోంది. మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవంక అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను  కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు.  నేడో రేపో ఎన్డీఎ కూటమి అభ్యర్ధి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.  ఈ రెండు రోజుల్లో పేరు ప్రకటించినా ప్రకటించక పోయినా.. అంతర్గతంగా ఏకాభిప్రాయమ ఏర్పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని  విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే..  ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రుల స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అదే సమయంలో నూతన ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆచి తూచి అడుగులు వేస్తోందని అంటున్నారు. ఉపరాష్ట్రపతి  రాజ్యసభ చైర్మన్ బాధ్యతలను కూడా నిర్వరించవలసి ఉంటుంది కనుక.. పార్లమెంట్ వ్యవహారాల్లో తగిన అనుభవం, విధివిధానాల పట్ల సంపూర్ణ అవగాహన అవసరం కనుక, ఇటు పార్లమెంట్ అనుభవంతో పాటుగా రాజకీయ చతురతతో పెద్దల సభను సమర్ధవంతగా నడపగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉందని అంటున్నారు. సమర్ధత, సామర్ధ్యంతో పాటుగా రాజకీయ జీవితంలో వివాదరహితునిగా పేరున్న   పెద్ద  మనిషిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు.. ఇంతవరకు ఎక్కడా వినిపించని, ఎవరూ ఉహించని, అదృశ్య వ్యక్తి ఒక్కసారిగా తెరపైకొచ్చినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అంటున్నారు.

అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం  నలుగురు ప్రస్తుత గవర్నర్లతో పాటుగా, ఒకరిద్దరు మాజీ గవర్నర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉపరాష్ట్రపతి రేసులో గుజరాత్ గవర్నర్. ఆచార్య దేవవ్రత్  అందరికంటే ముందున్నారు. అలాగే  కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గహ్లోత్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథూర్  కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ సిన్హా పేర్లు ప్రముఖగా వినిపిస్తునాయి. 

అలాగే..  ఓబీసి వర్గానికి చెందిన  మహిళ అయిన మాజీ  ఎంపీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి..  నూతన ఉపరాష్రపతి పదవికి ప్రస్తుత లేదా మాజీ గవర్నర్ల లో ఒకరని ఎంపిక చేసే అవకా శాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. మహిళా సాధికరితకు ఎత్తు పీట వేస్తూ గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన విధంగా.. అదే ఒరవడిలో ఉపరాష్ట్రపతి పదవిని  కూడా మహిళకు ఇవ్వలని భావిస్తే ఏమో కానీ..  లేదంటే గవర్నర్లలో ఒకరిని   ఉపరాష్ట్రపతి చేసే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే.. కొస మెరుపుగా  చివరకు మోదీ,షా మ్యామాజిక్ బాక్స్ లోంచి ఏ పేరు బయటకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.