మకర సంక్రాంతి స్పెషల్..నువ్వుల లడ్డు తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో..!

Publish Date:Jan 10, 2024

Advertisement

చలికాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం. ఈ సమయంలో పంట చేతికి వస్తుంది. రైతులు ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఈ సమయాన్ని గొప్ప పండుగగా జరుపుకుంటారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూడు రోజులపాటు పొంగల్ ను ఘనంగా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతికి పండుగకు స్పెషల్ నువ్వులు. ఈ పండుగలో నువ్వులు, బెల్లం, చెరకు ఎక్కువగా వినియోగిస్తారు. సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పొంగల్:

పొంగల్ ను సాధారణంగా మకర సంక్రాంతి రోజు ఆరుబటయ తయారుచేస్తారు. సూర్యరశ్మి నుంచి మనకు విటమిన్ డి అందుతుంది. ఎంతో రుచికరమైన పొంగల్లో నెయ్యిని వాడుతారు. నెయ్యిలో కరిగే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ వంటకంలో విటమిన్ ఇ, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

నువ్వులు, బెల్లం:

వేరుశెనగ, ఎండు కొబ్బరి, నువ్వులు, బెల్లం మిశ్రమంతో లడ్డును తయారు చేస్తారు. నువ్వులు విటమిన్ ఇ, రాగి, కాల్షియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలకు మంచి మూలం. నువ్వుల నూనె మన చర్మం, జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ఎండు కొబ్బరి:

ఎండు కొబ్బరిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, ఎమ్‌సిటిలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి చలికాలంలో చర్మ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.

వేరుశనగ:

వేరుశెనగలో ఒమేగా-6 ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మం, కణాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. బి విటమిన్ బయోటిన్, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల, మృదువైన తల చర్మం కోసం అవసరం. ఇది వేరుశెనగలో లభిస్తుంది.

బెల్లం:

బెల్లం చెరకు నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. చెరకు కాలేయం డిటాక్స్‌లో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చల్లని వాతావరణంలో జలుబు, దగ్గును నయం చేస్తుంది.బెల్లంలో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి అనేక ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

By
en-us Political News

  
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.