సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం
Publish Date:Feb 25, 2021
Advertisement
శాఖాహరం తీసుకుంటేనే మనిషి కొన్నాళ్ళు అయినా భూమిపై మనుగడ అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్ల్బెర్ట్ ఐన్స్టైన్ అన్నారు. అలా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సహజంగా కాయగూరలు, పళ్ళు, చిక్కుళ్ళు, బంగాళా దుంపలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, మూలికలు మసాలాలు, నెయ్యి, మజ్జిగ, రిఫైండ్ చేయని నూనెలు తీసుకోవాలి. పళ్ళలో: నారింజ,అనాస పండు, ద్రాక్ష పళ్ళు, డేట్స్, అత్తి పండ్లు, పుచ్చ కాయ. చిక్కుళ్ళు: బీన్స్, పచ్చి బటానీ, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు తదితరాలు. దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళదుంపలు, కలోకాసియా తదితరాలు. తృణ ధాన్యాలు: మిల్లెట్స్, ఫొక్ష్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తదితర ధాన్యాలు. పాల పదార్ధాలు: నెయ్యి, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ. మూలికలు, సుగంధ ద్రవ్యాలు: తులసి, పుదీనా, పసుపు, జీల కర్ర, జాజి కాయ, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, వెల్లుల్లి తదితరాలు. కొవ్వు పదార్ధాలు: రీఫైండ్ చెయ్యని నూనెలు, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె తదితరాలు. మన రోటీన్ జీవితంలో సరైన సమయంలో సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు.
కూరాగాయాలలో: తాజా కూరగాయాలు, ఆకూ కూరలు, తదితరాలు.
http://www.teluguone.com/news/content/nutritious-food-34-110691.html





