వదల బొమ్మాలీ.. నిన్నొదల.. జగన్ ను వెంటాడుతున్న నంబర్ 11
Publish Date:Mar 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డిని 2024 ఎన్నికల తరువాత నుంచీ నెటిజనులు లెవన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చేరింది. కారణం తెలిసిందే కదా.. 2024 ఎన్నికలలో ఆయన పార్టీ సాధించిన స్థానాల సంఖ్య 11 కావడంతో ఆ సంఖ్య పేరుతోనే వైసీపీ అధినేతనూ, ఆ పార్టీని నెటిజనులు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీయులకు నంబర్ 11 ఒక పీడకలలా తయారైంది. ఇక ఆయన వ్యతిరేకులైతే జగనాసుర, లెవనాసురా అంటూ కూడా ఎద్దేవా చేస్తుండటం కద్దు. అంతే కాదు జగన్ తన ఎమ్మెల్యేలతో ఇలా అసెంబ్లీకి హాజరై అలా వాకౌట్ చేసిన సందర్భంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చిన జగన్ 11 నిమిషాల 11 సెకన్లు మాత్రమే ఉండి వెళ్లడంతోనే స్పీకర్ ఈ కామెంట్ చేశారు. అలాగే గతంలో ఓసినిమా ఫంక్షన్ లో నటుడు పృధ్వీ పదకొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ వైసీపీయులు జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు కారణం 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన పార్టీ శ్రేణులకూ గిట్టదు.గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా.. వైసీపీయులకు 11 నంబర్ కనిపించినా, వినిపించినా జగన్ ను ఉద్దేశించే అని ఉలిక్కిపడుతుంటారు. ఉడుక్కుంటుంటారు. అంతెందుకు గతంలో ఆయన జైల్లో ఉన్న కాలాన్ని కూడా పదకొండుకు ముడిపెట్టి నెటిజనులు సెటైర్లు వేస్తున్నారంటే వైసీపీ అండ్ కోను నంబర్ 11 ఎలా వెంటాడుతోందో, ఏడిపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్ చేస్తున్నది. ఎలా అంటే ఇప్పటి వరకూ సీబీఐ ఆయనపై వేసిన ఛార్జి షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయన ఏవన్ నిందితుడు. ఏ అంటే న్యూమరాలజీ ప్రకారం ఒకటి. వన్ అంటే ఒకటి. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూసినా పదకొండే వస్తుందని జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు కూడా. అలాగే అప్పట్లో జగన్ వరుసగా 11 శుక్రవారాలు ర్టుకు హాజరైన సంగతీ ఆయనపై ట్రోలింగ్ కు దోహదపడింది. అంతెందుకు ఇటీవలి కాలం వరకూ వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా 11 ఉండేది. కొందరు రిజైన్ చేయడంతో ఆ సంఖ్యలో మార్పు వచ్చింది. అది వేరే సంగతి. అలాగే జగన్ ఢిల్లీ పర్యటనల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, పదకొండవ నెంబర్ ఆయన్ను వదల కుండా వెంటాడింది. వెంటాడుతోంది. జగన్ లెవన్ పై మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవన్ లాగా.. జగన్స్ లెవన్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే. పార్లమెంటులో మొదటి అంతస్తులోని 11వ నంబర్ రూమ్ ను స్పీకర్ కేటాయించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన వైసీపీ ఎంపీలు ఆ రూమ్ ను ఆక్యుపై చేయడానికి నిరాకరించారు. మూకుమ్మడిగా స్పీకర్ ను కలిసిన వారు ఆ రూమ్ తమకు వద్దనీ, మరో రూమ్ కేటాయించాలంటూ కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకున్నారు. వారి వినతులను మన్నించి స్పీకర్ వారికి 11వ నంబర్ రూమ్ ను మార్చి 12వ నెంబర్ రూమ్ ను కేటాయించారు. దీంతో 11 నంబర్ జగన్ ను వదల బొమ్మాలీ నిన్నొదల అన్నట్లు వెంటాడుతోందని నెటిజనులు నెట్టింట సెటైర్లు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/number-11-haunting-jagan-39-216108.html





