15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ

Publish Date:Aug 29, 2022

Advertisement

తెలుగు లోగిళ్లలో ఏ ఇంట చూసినా.. ఏ న్యూస్‌ వీక్షించాలన్నా.. ఇప్పుడు ఎన్టీవీ.. అంతలా తెలుగు వీక్షకులు ఎన్టీవీతో కనెక్ట్‌ అయ్యారు.. 2007 ఆగస్టు 30వ తేదీన ఎన్టీవీ 24 X 7 తెలుగు న్యూస్‌ చానెల్‌ను ప్రారంభించారు.. రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరిగారు..  ఆ తర్వాత.. భక్తి టీవీ, వనిత టీవీలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.. ఆధ్యాత్మిక పరమయిన ఏ కార్యక్రమాలు చూడాలన్నా భక్తి టీవీ పెట్టాల్సిందే. మహిళల్లో మరింత చైతన్య భావాలు కలగాలంటే వనితా టీవీ చూడాల్సిందే అనేలా వాటిని తీర్చిదిద్దారు. మహిళల కోసం దక్షిణ భారత దేశంలో తొలి చానల్‌ ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇప్పుడు ఎన్టీవీ తెలుగు న్యూస్‌ చానెల్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది.. దాదాపు గత ఏడాది కాలంగా.. తనకు సాటిలేదంటూ నంబర్‌ వన్‌గా దూసుకుపోతోంది.. అంతేకాదు 15 ఏళ్ల పండుగకు సిద్ధమైంది.. 

ఈ 15 ఏళ్ల ప్రయాణం అంత సులువుగా సాగింది ఏమీ కాదు.. జర్నలిజం అంటే ఒక బాధ్యత.. ఒక కట్టుబాటు.. కత్తిమీద సాము అనే చైతన్యంతో తన జర్నీని ప్రారంభించింది.. అప్పటికే 24X7 న్యూచానెళ్లు తెలుగులో ఉన్నా.. లైవ్‌లు అంతంత మాత్రమే.. ఎన్టీవీ ఎంట్రీతో ఆ సీన్‌ మారిపోయింది.. ప్రతీక్షణం.. ప్రత్యక్ష ప్రసారం.. ప్రతీక్షణం.. ప్రజాహితం అంటూ.. ఎప్పటికప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ ప్రాంతం నుంచి.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా న్యూస్‌ టెలికాస్ట్‌ చేసింది.. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. ఓబీ వ్యాన్లతో వార్తా ప్రసారాల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకెళ్లింది.. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి.. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలన్న లక్ష్యంతో.. కేవలం వార్తా ప్రసారాలకే పరిమితం కాకుండా.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యింది.

ఆది నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది ఎన్టీవీ.. విద్యార్థులు, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా జాతీయ గీతాలాపన నిర్వహించింది.. 'మన దేశం - మన గీతం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపనలో కోట్లాది మందిని కదిలించింది. ఇక, ఎన్నికల సర్వేలు అంటే ఎన్టీవీవి పెట్టింది పేరు.. ఎన్టీవీ సర్వేలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. అవి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాయి. ఇలా ఎన్టీవీ ఎప్పటికప్పుడు వార్తా ప్రసారాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తూ వచ్చింది.. అంతే కాదు.. మరో వైపు ట్రెడిషన్‌ను కూడా ఫాలో అవుతూ వచ్చింది..

కోటీదీపోత్సవం పేరుతో ప్రతీ ఏడాది ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడుపుతారంటే.. ఆ కార్యక్రమానికి ప్రజల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.. సనాత ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.. పీఠాలను, పీఠాధిపతులను, ధర్మకర్తలను ఇలా ఎంతో మందిని కోటి దీపోత్సవం పేరుతో సామాన్యులకు చేరువ చేసింది.. దిగ్విజయంగా 15వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

ఈ సుదీర్ఘ దిగ్విజయమైన జర్నీలో యాజమాన్యం కమిట్‌మెంట్‌ అసాధారణమైనది.. అదే స్థాయిలో ఉద్యోగుల నుంచి యాజమాన్యానికి అసాధారనమైన సపోర్ట్‌ లభించింది.. ఇక, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నారు చౌదరి గారు.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది.. అది మీడియా రంగాన్ని కూడా తాకింది.. అలాంటి సమయంలోనూ యథావిథిగా తన ఉద్యోగులకు సాలరీస్‌  
అందించారు.. 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ.. మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆశిద్దాం..

By
en-us Political News

  
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.