పుస్తక ప్రదర్శనలో ఎన్టీఆర్ అరుదైన లేఖలు
Publish Date:Jan 6, 2026
Advertisement
అన్న నందమూరి తారక రామారావు ఎప్పుడో 1950 దశకంలో రాసిన లేఖలను ప్రస్తుతం బెజవాడ పుస్తక ప్రదర్శనలో చిన్నా, పెద్దలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అప్పట్లో చెన్నైలో ఉన్న తారకరాముడు తెలుగు భాషను ప్రాణంగా భావించేవారు. తెలుగాభాషను ఎన్టీఆర్ ఎంత గౌరవీంచేవారనడానికి ప్రత్యక్ష నిదర్శంగా నిలుస్తున్నాయి 1950ల్లో ఆయన రాసిన లేఖలు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలోని ఆంధ్ర గ్రంధాలయం ప్రచారం కోసం పనిచేస్తున్న కొందరు 1955లో ఎన్టీఆర్‌ను కలిశారు. వారి సేవల గురించి తెలుసుకుని, వారిని అభినందిస్తూ ఎన్టీఆర్ స్వదస్తూరితో లేఖ రాశారు. తర్వాత 1957 సెప్టెంబర 16న గ్రంథాల సేవలను మెచ్చుకుంటూ రూ.100 చెక్కు ఇస్తున్నానని మద్రాసు నుంచి మరో లేఖ పంపించారు. ఎన్టీఆర్ సంతకంతో ఉన్న ఆ లేఖలను ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసిన స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ యుగపురుషుడి లేఖలను అందరూ ఆసక్తిగా తిలకిస్తూ.. చిత్ర పరిశ్రమను, తెలుగు భాషను గుర్తుచేసుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/ntrs-letter-36-212099.html





