నీరుకొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం

Publish Date:Sep 26, 2025

Advertisement

అమరావతిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా  అమరావతి సమీపంలోని నీరుకొండపై   భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. నీరుకొండ 300 అడుగుల ఎత్తు కలిగి ఉంది. విగ్రహ నిర్మాణం కోసం 100 అడుగుల ఎత్తున్న బేస్ నిర్మించి,  ఈ బేస్ పై 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. అంటే మొత్తం 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందన్న మాట.  ఇక ఈ విగ్రహం   బేస్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు, మ్యూజియం, మినీ థియేటర్,    కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది.

విగ్రహం వద్దకు చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహ నిర్మాణం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇలా ఉండగా  దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  స్మారకాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపొందిం చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆకాంక్షకు అనుగుణంగా..  నీరుకొండ ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ప్రాజెక్టుకు ఏర్పాటు కానుంది.   10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎన్టీఆర్ స్మారకాన్నిఏర్పాటు చేయనున్నారు.  
 

By
en-us Political News

  
హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్‌లోని ఒక ఓయో హోటల్ గదిలో యువతి దారుణంగా హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఒక ఆటో డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు మరియు హత్యకు గల కారణాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసి, బస్సును అపహరించి రాంగ్ రూట్‌లో బీభత్సం సృష్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లెలి హత్యకు 6 నెలల తర్వాత పక్కా ప్లాన్‌తో 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ రిベンజ్ మర్డర్ కేసు పూర్తి వివరాలు తెలుసుకోండి.
కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా 20 ఏళ్ల సర్వీస్‌లో 40 బదిలీలు ఎదుర్కొన్నా భయపడకుండా అవినీతిపై పోరాడుతున్నారు. శశికళ జైలు కుంభకోణం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన ఆమె నిజాయితీ సాహస గాథ ఇక్కడ చదవండి.
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.