ఎన్టీఆర్ శత జయంతి కానుక.. త్వరలో వెబ్ సైట్, సావనీర్

Publish Date:Feb 4, 2023

Advertisement

నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయన చరిత్ర భావి తర తరాలకు స్ఫూర్తి  కావాలనే  ఉద్దేశంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని  మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి  టి .డి  జనార్దన్ తెలిపారు.     ఎన్ .టి .ఆర్ శత జయంతి కమిటీ  చైర్మన్ జనార్దన్ శనివారం (ఫిబ్రవరి 4)  మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్  సినిమాలలో పలు చిరస్మర ణీయమైన పాత్రలు పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారనీ,  అలాగే రాజకీయాలలో ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల స్వల్ప కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారనీ చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో  ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలను అందుకున్నారని చెప్పారు.  ఎన్టీఆర్  తెలుగునాట మాత్రమే కాదు,  భారత రాజకీయాలలో కూడా క్రియాశీల పాత్ర పోషించి,   జాతీయ నాయకుడిగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారన్నారు. దార్శనికత కలిగిన నాయకుడిగా ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారి కి  మార్గదర్శకం కావాలనే ఉద్ధేశంతో  ఎన్టీఆర్ శత జయంతి కమిటీ, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం,  రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్ .టి ఆర్ వెబ్ సైట్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు.

అలాగే ఎన్టీఆర్ తో చిత్ర రంగంలో పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ రంగంలో వారితో సాన్నిహిత్యం వున్న నాయకులు,ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారి  వ్యాసాలు , ప్రముఖుల కథనాలు, సందేశాలు , అరుదైన ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక రూపొందిస్తున్నట్లు జనార్దన్ చెప్పారు. అలాగే  ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు , చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురించనున్నట్లు జనార్దన్ తెలిపారు. 

ఎన్టీఆర్ నటుడిగా  తెలుగు ,తమిళ ,హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. మూడు  తరాల ప్రేక్షకులకు  ఆయన అభిమాన నటుడయ్యారు. సినీ రంగంలో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అపూర్వం ,అనితర సాధ్యం . కేవలం నటుడిగానే కాక ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అన్నగా నేనున్నానంటూ ముందు కొచ్చి ఆదుకున్నాడు . రాయలసీమ కరవు , దివిసీమ సీమ ఉప్పెన విపత్తులలో బాధితులను ఆదుకోవడానికి సహ నటీనటులతో కలిసి  కలసి విరాళాలు సేకరించారు.  చైనా యుద్ధ సమయంలో కూడా దేశ రక్షణ కోసం నిధుల సేకరణకు నడుం బిగించారు. ఆ అసమాన సేవే ఆయనను రాజకీయ రంగం వైపు నడిపించిందని జనార్దన్ తెలిపారు. తెలుగువారి ఆత్మ  గౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు  చరమ గీతం  పలకాలని, నట జీవితాని త్యాగం చేసి  1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన మహోన్నత నాయకుడు,ఆదర్శ ప్రజా సేవకుడు,  తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత   ఎన్ .టి .ఆర్ అని జనార్దన్ చెప్పారు .

సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రను సృష్టించాయన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ,మహిళలకు ఆస్తిలో హక్కు  వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని, నిలువనీడ కల్పించలేని, కట్టుకోవడానికి గుడ్డ ఇవ్వలేని రాజకీయం ఎందుకని? ఆయన ఆవేదనతో ప్రశ్నించారు.అది  నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో చివరి వరకూ కృషి చేశారని జనార్దన్ చెప్పారు.

ఎన్టీఆర్  భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అయినా,  ఇప్పటికీ జాతికి స్ఫూర్తి నిస్తూనే వున్నారు  ఆయన జీవితం తర తరాలకు మార్గదర్శం కావాలనే ఈ మహాయజ్ఞానికి పూనుకున్నామని జనార్దన్ తెలిపారు. ఎన్ .టి .ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ , హైదరాబాద్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని , తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు , ఇతర జాతీయ నాయకులు , సినిమారంగ  ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు . 

ఈ కమిటీలో  సీనియర్ నాయకులు ఎమ్ .ఏ .షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్, తెలుగు వన్  ఎండీ కంఠంనేని రవి శంకర్ , నిర్మాతలు  కాట్రగడ్డ ప్రసాద్,  అట్లూరి నారాయణ రావు,  సీనియర్ జర్నలిస్టులు విక్రమ్ పూల, భగీరథ,  పారిశ్రామిక వేత్త మధుసూదన రాజు, మండవ సతీష్ , కాసరనేని  రఘురామ్  శ్రీపతి సతీష్ వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు .  రామ్మోహన్ రావు , సత్యనారాయణ , వినాయకరావు తదితరులు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారని జనార్దన్ తెలిపారు .   

  ఈ ప్రయత్నానికి అన్నగారి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు , అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా  tdjanardhan@gmail.com మెయిల్ లేదా 9866178085 మొబైల్ నంబర్ కి WhatsApp పంపించి సహకరించాలని జనార్ధన్ మీడియా ద్వారా  జనార్దన్ విజ్ఞప్తి చేశారు .

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకున్న వేళ, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో విజయదశమి లేదా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.