ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు
Publish Date:Jul 5, 2025
Advertisement
ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది. 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఈ స్కీమ్ మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నాళ్లు అమలు చేసిన తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 'ఎన్టీఆర్ బేబీ కిట్లు' పేరుతో మళ్లీ మొదలు పెడతోంది. ఈ కిట్‌లో దోమతెరతో ఉన్న వాటర్ ప్రూఫ్ షీటు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ, బట్టలు, తువ్వాలు, పరుపు, నాప్కిన్లు లాంటి 11 వస్తువులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రెండేళ్ల పాటు DMHOలు, DCHSలు, GGHలకు 'రేట్ కాంట్రాక్ట్' పద్ధతిలో కిట్లు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ కిట్లను పంపిణీ చేసే బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే 11 రకాల వస్తువులతో కలిపి.. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1410గా ఉంటుందని చెబుతున్నారు
http://www.teluguone.com/news/content/ntr-baby-kits-25-201353.html





