Publish Date:May 29, 2023
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలంగాణలో కూడా ఘనంగా జరిగాయి. ఒక్క తెలంగాణ అనేమిటి తెలుగువారు ఉన్న అన్ని దేశాలలో, రాష్ట్రాలలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ తన 101వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్టీఆర్ ను స్మరించుకుని ఆయన గొప్పతనాన్ని ప్రస్తుతించారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నందమూరి తారక రామారావు రాజకీయాలను ప్రజలకు చేరువ చేశారు. సంక్షేమం, సంస్కరణలలో విప్లవం తీసుకువచ్చారు. అందుకే రాజకీయాలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఎన్టీఆర్ ను అందరూ అభిమానిస్తారు. గౌరవిస్తారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ, విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఘనంగా జరుపుకున్నారు.
తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేసిన కేసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ.. శత జయంతిని ఘనంగా నిర్వహించడం ఎన్టీఆర్ గొప్పదనానికి, ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్ శత జయంతిని పలువురు బిఆర్ఎస్ నాయకులు నిర్వహించడం రాజకీయాలకు అతీతంగా ఆయనపై ఉన్న అభిమానం, గౌరవాలకు తార్కానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు, తరువాత కూడా అంటే ఎన్టీఆర్ మరణం తరువాత తెలుగుదేశం పార్టీని ఆంధ్రాపార్టీగా ముద్ర వేసినా.. ఎన్టీఆర్ ను మాత్రం బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తమ వాడిగా, ఆత్మీయుడిగా గుండెల్లో దాచుకుందనడంలో సందేహం లేదు.
రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీని ఉద్యమ నేతలు విమర్శలు చేసినా తెలంగాణ అభివృద్ధిలో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం భాగస్వామ్యాన్ని వారు విస్మరించలేదు. తెలుగుజాతి ఉమ్మడి ఆస్తి ఎన్టీఆర్. రాజకీయ, ప్రాంతీయ విభేదాలతో ఎవరైనా సరే ఆయన ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని విస్మరించలేరు. తెలుగు నుడికారం ఎన్టీఆర్, తెలుగు జాతి చిరునామా ఎన్టీఆర్. జయమో ఎన్టీఆర్
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ntr-an-asset-to-telugu-people-25-155991.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్