బాబు భద్రతకు ముప్పు?.. సెక్యూరిటీ పెంచాలని ఎన్ఎస్జీ నిర్ణయం!

Publish Date:Aug 25, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) డీఐసీ భద్రతా ఏర్పాట్లు సమీక్షించం, పర్యవేక్షించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మందిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒకరు. అటువంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం, ఆయన నివాసంలో ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్ సింగ్ స్వయంగా పరిశీలించడం. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి తగు సూచనలు చేయడంతో ఏం జరిగిందన్న ఆందోళన తెలుగుదేశం శ్రేణుల్లోనే కాకుండా సామాన్యులలో కూడా నెలకొంది. ఈ హఠాత్ తనిఖీలు, సమీక్షల వెనుక చంద్రబాబుకు ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ లే కారణమని భావిస్తున్నారు. ఏపీలో ఆయన భద్రతకు సంబంధించిన పలు అనుమానాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నం వంటి సంఘటనల నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ పుట్స్ రావడంతో ఆయన భద్రత  విషయంలో ఎన్ఎస్జా అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రతపై రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగాద ఎన్ఎస్జీ భద్రత ఉన్నది కేవలం నలభై మందికి మాత్రమే. వారిలో చంద్రబాబు కూడా ఒకరు. ఈ మేరకు ఎన్ఎస్జీ డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తేలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పరిశీలించారు. భద్రతా పరంగా కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆయనకు భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున చంద్రబాబుకు లభిస్తున్న భద్రతా ఏర్పాట్ల పట్ల ఎన్ఎస్జీ బృందం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు పర్యటనలలో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీసు విభాగం భద్రతా4 ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, భద్రతా చర్యలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఏపీ పోలీసులు అటువంటి ప్రత్యేక ఏర్పాట్ల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ఆయన పర్యటనలలో ఉన్న సమయంలో అధికార పక్ష కార్యకర్తలు ఆయనపై దాడులకు సైతం సిద్ధపడుతున్నా భద్రతా ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్ఎస్జీకి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు కూడా చేశారు.

తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన సంఘటనలు ఏపీ పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉన్నదో తేటతెల్లం చేశాయి. చంద్రబాబు ప్రారంభోత్సవం చేయాల్సిన అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఆయన పర్యటనను అడ్డుకోవడానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఆయన సమీపంలోనికి దూసుకు వెళ్లడం వంటి ఘటనలు ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్జీ ప్రత్యేక బృందం చంద్రబాబు సెక్యూరిటీపై సమీక్ష చేసింది. స్వయంగా పరిశీలించి భద్రతను పెంచాలని నిర్ణయించింది. 

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.