Publish Date:Oct 14, 2022
ఊళ్లోవాళ్లు మన గురించి ఏటనుకుంటున్నారో చెవొగ్గిరా.. అంటూ ఊరు ప్రెసిడెంటు తన బంటుని పురమాయించాడు. వాడు తిరిగినా తిరక్కపోయినా సాయింత్రానికి ఆయన దగ్గరకెల్లి పెద్ద గొప్పగా ఏటీ సెప్పుకోటల్లేదండి మరి అనేశాడు. ప్రెసిడెంటుకీ తెలుసు..అది వాడి మాటేనని. ఆయన రాత్రంతా ఆలోచించి పొద్దుటికల్లా ఒక పెద్ద బౌండ్ పుస్తకాన్ని ఇంటి ఆవరణలోనే చిన్న బల్లమీద పెట్టి రోజూ ఎవరు ఎక్కడికెళుతున్నారు, కారణం, సైకిల్ నెంబర్‌తో సహా రాయమన్నారు. ఈ సంగతి డప్పేయిం చాడు. అంతా నవ్వుకున్నారు. ఇపుడు మోదీగారి ప్రభుత్వం చేపట్టి వినూత్న కార్యక్రమం కొద్దిగా ఇలానే ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి గనుక ఓటర్ల వివరాలు అవసరమే. కానీ వారి పేర్లు, చిరు నామాతోనే కాదు వారి దగ్గరున్న సమస్త కార్డుల వివరాలతో సహా పేర్లు తనముందు ఉండాలని జాతీయ స్థాయిలో రిజిస్టర్ కావాలని కొత్త ఆలోచన చేసారు. పైగా దానికి చక్కగా అఖిల భారత డేటా బేస్ అంటూ సూటేసిన పేరొకటి పెట్టారు. రిజిస్టర్‌లో ప్రతీ పౌరుడి పుట్టిన, మరణించిన సర్టిఫికెట్ వివరాలూ ఉంటాయి. అంచేత ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు, తప్పించుకోలేరు. అన్నీ శ్రీప్రభుత చేతుల్లోనే ఉంటారు.
ముందు అడుగుగా జాతీయస్థాయిలో సిటిజెన్స్ రిజిస్టర్ (ఎన్ ఆర్ సి) సంబంధించి కేంద్ర హోం శాఖ డేటాబేస్ తయారు చేయడానికి ఒక క్యాబినెట్ నోట్, ఒక బిల్లు ఆమోదించేలా ఈ శాఖ చేయనున్నట్టు తెలియ జేసింది. ఇప్పటివరకూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇటువంటి డేటాబేస్ ప్రాంతీయ రిజిస్టార్ల సహాయంతో నియంత్రిస్తున్నది. ఇక త్వరలో ఇదంతా కేంద్రం పరిధిలోకి వెళ్లనుంది. ఓటర్ ఐడితో ఆధార్ లింక్ చేయడమన్నది ఇప్పటివరకూ ప్రభుత్వం చెబుతున్నది ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇక చాలా సీరియస్‌గా తీసుకోవాల్సివస్తుంది. జనాభా లెక్కలు, ఓటర్ల జాబితాతో పాటు ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం సమన్వయం చేయదలచింది. అన్ని రాష్ట్రాల రిజిస్ట్రార్లూ భారత రిజిస్ట్రార్ జనరల్ డేటా పంచుకుంటారు. అవసరమైన సమయంలో మార్పులు చేర్పులూ చేపడతూంటారు. ముఖ్యంగా ఆధార్, లైసెన్స్‌లు, రేషన్‌కార్డులు, ఓటర్ కార్డుల వివరాల విషయాల్లో ఈ మార్పులు చేర్పు లు చేపడతారు. ఈ సమాచారం అంతా జాతీయ రిజిస్ట్రార్‌కు అందజేస్తారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా విదేశాల నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్నవారి వివరాలు చట్టరహితమని జాతీయ జనాభా రిజిస్టర్ పేర్కొన్నారు. ఈ ఎన్ఆర్సిని మొదటి సారిగా అస్సాంలో ఆరంభించారు. ఇపుడు జాతీయ స్థాయిలో ఆరంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. దీనికి తోడు సిటిజన్‌షిప్ అమెండ్మంట్ చట్టాన్ని కూడా అమలు చేయాలన్న ఆలోచన లో ఉంది. దీన్ని గురించి జాతీయస్థాయిలో మూడేళ్ల క్రితం వ్యతిరేకత వ్యక్తమయింది. విదేశాల నుంచి వచ్చి ఉండేవారి పౌరసత్వ విషయంలో వారు 2015కి ముందు వచ్చినవారికే పౌర సత్వం కల్పించడం జరిగింది. అయితే వారు ముస్లింలు కాకుంటే ఎన్ ఆర్‌సి ప్రక్రియ మైనారిటీల అంశంగా తీసుకుని చేయబడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nrc-with-national-data-base-39-145398.html
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.