ఇక టీఆర్ఎస్ నుంచీ జంప్ జిలానీలు

Publish Date:Apr 26, 2022

Advertisement

దాదాపు 9 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు వర్గ విభేదాలు ఆ పార్టీని చీకాకు పెడుతున్నాయా అంటే అవుననే అనాలి. పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు ఆయా జిల్లాల్లో పార్టీని చీకాకు పరుస్తున్నాయి. అంతే కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు, సీటు ఆశిస్తున్న ఆశావహులకు మధ్య పొసగడం లేదు. దీంతో అసమ్మతీయులు పక్క చూపులు చూస్తున్నారు. అటువంటి వారిని అక్కున చేర్చుకోవడానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. తెరాస అసమ్మతి వాదులకు తలుపులు బార్లా తెరిచి ఉంచాయి. దీంతో ఇప్పటి వరకూ ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చి చేరడమన్న పరిస్థితి ఇక ముందు తెరాస నుంచి వలసలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గతంలో ఎన్నడూ లేని విధంగా తెరాసలో ధిక్కార స్వరం వినిపించడమే ఇందుుక నిదర్శనమని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితిని వారు ఉదహరిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీల మధ్య విభేదాల పరిష్కారం పార్టీ అధినేత వల్ల కూడా కాకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.  ఈ ఇరువురిలో ఒకరు పార్టీ మారే విషయంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే  ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు తెలిసిందే. అయితే ఇటీవల ఇరువురి మధ్యా సంబంధాలు మరింతగా దెబ్బతిన్నట్లు వరుస సంఘటనలను బట్టి అర్ధమౌతుంది. రానున్న ఎన్నికలలో తాండురు నుంచి పార్టీ ఎమ్మెల్యేగా పోటీలో ఉండేది తానేనని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బహిరంగంగానే చెప్పుకుంటుండటంతో విషయాన్ని హై కమాండ్ దగ్గరకు తీసుకు వెళ్లారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. దీంతో పార్టీ అధినేత ఇరువురతో మాట్లాడినా పరిస్థితితో మార్పు రాలేదు. దీంతో ఎమ్మెల్యే కినుక వహించినట్లు చెబుతున్నారు. 
అలాగే ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలలో కూడా ఆశావహులు, సిట్టింగ్ ల మధ్య పెద్దగా పొసగడం లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో తుమ్మల ఇప్పటికే అలకపాన్పు ఎక్కారు. ఆయన ఎప్పుడైనా పార్టీ మరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా  వచ్చే ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.