ఇక ఇప్పుడు ఏపీ వంతు? ఓటరు ఎదురు చూపు ఎన్నికల వైపే!

Publish Date:Dec 6, 2023

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తొమ్మిదేళ్ల అహంకారపూరిత పాలనకు ముగింపు పలికారు. పాలకుల అహంకారాన్ని ఎదిరిస్తూ ఆందోళనలు చేయలేదు. రోడ్లెక్కలేదు. మౌనంగా ఎన్నికలు వచ్చే వరకూ ఎదురు చూశారు. ఓటు పవర్ ఏమిటో చూపించారు. అంతే తొమ్మిదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదిగిపోయింది. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో అస్సలేమీ చేయలేదని అనడానికి వీల్లేదు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, సంక్షేమ పథకాలను కొనసాగించడంలోనూ బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడా వెనుకబడలేదు. అయితే జనం   అభివృద్ధి, సంక్షేమాలతో పాటు గౌరవం కూడా కావాలనుకున్నారు. తమ మాట వినని, తమ ముఖం చూడని ముఖ్యమంత్రి అవసరం లేదని భావించారు. దొరల కోటల్లాంటి నివాసంలో ఉంటూ తనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలకు ముఖం చూపించి, ఆ తరువాత నిర్లక్ష్యం చేసే సీఎం వద్దని తిరస్కరించారు. స్థూలంగా, సూక్షంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ పాలన, అహంకార పూరిత ధోరణి  బీఆర్ఎస్ ఓటమికి కారణం. మరి ఎంతో  కొంత రాష్ట్రాభివృద్ధికి పాటుపడి, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించిన కేసీఆర్ నే జనం తిరస్కరించారంటే.. అసలు అభవృద్ధి ఆనవాలే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా స్థితికి చేర్చిన జగన్ కు ఏపీ జనం ఎలాంటి ఓటమిని అందిస్తారన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సాగుతోంది. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే చాలా చాలా కాలంగా ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నోరెత్తితే కేసు,అడుగు బయటపెడితే జైలు అన్నట్లు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ జగన్ రెడ్డి సర్కార్ ఒక జైలుగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, స్వయంగా ముఖ్యమంత్రి సభలకే జనం మొహం చాటేస్తున్నా, పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలే దూరంగా ఉంటున్నా జగన్ తన తీరు, వైఖరీ మార్చుకోవడం లేదు.

నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా జగన్ వ్యవహారం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రజలు, మధ్య తరగతి మేధావులే కాదు, గత ఎన్నికల్లో ఏదో ఆశించి, వైసేపీకి ఓటేసి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా, ఎన్నికలు  సమయంలో చంద్రబాబు అంతటి  సీనియర్ నాయకుని, అక్రమంగా, అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులనూ  వేధింపులకు గురి చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలాచాలా  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

 చట్టాని చుట్టేసి,  రాజ్యంగ విరుద్ధ పరిపాలనను ఇష్టారాజ్యంగా  సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు ఇప్పుడు  ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వైసీపీ మంత్రులు, నాయకులు చేసిన ప్రకటనలు  జనంలో జగన్ సర్కార్ పట్ల పూర్తి స్థాయి వ్యతిరేకతకు కారణమయ్యాయి. శిశుపాలుడి నూటొక్కో తప్పులా జగన్ చంద్రబాబును అరెస్టు చేసి తన చివరి తప్పు చేసేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా ప్రజాభిమానాన్ని తిరిగి పొందగలిగే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు, స్వయంగా జగన్ కు ఇంటెలిజెన్స వర్గాలు అందించిన నివేదికలు, చివరాఖరికి జగన్ తన పార్టీ నేతలు, కార్యకర్తల కంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న ఐ ప్యాక్ కూడా ఇక సర్దేసుకోవడం మేలు, మరో చాన్స్ లేదనే చెప్పాయని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలను జోడు గుర్రాల్లా పరుగులెత్తించినా, పాలకుడిలో అహంకారాన్ని సహించని జనం ఆయనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అలాంటిది అభివృద్ధీ, సంక్షేమాలను పట్టించుకోకుండా, కేవలం అహంకారంతో, అహంభావంతో పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ ను ఏ స్థాయిలో ఓడిస్తారోనన్న చర్చ ఏపీలో యమా జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.