Publish Date:Apr 18, 2024
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఆయా రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 25. కాగా 26న నామినేషన్ల పరిశీల ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 29. మే 13న పోలింగ్. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఇక నోటిఫికేషన్ కూడా విడుదల కానుండటంతో ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి ప్రచారం హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా జోరుగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/notification-for-fourth-phase-elections-39-174073.html
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది.
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.