Publish Date:Mar 24, 2025
జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో బాగంగానే జగన్ కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూపానందకు నోటీసులు జారీ అయ్యాయి. స్వరూపానంద స్వామికి చెందిన ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా తేల్చిన అధికారులు ఆ స్థలంలో నిర్మించిన కట్టడాలను తొలగిం చాలని నోటీసులు జారీ చేశారు.
తొలుత చినముషిడి వాడలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. జగన్ హయాంలో ఈ కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో దాదాపు 15 వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ స్వరాపానంద విశాఖలో అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడీ నిర్మాణాలు తొలగిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/notices-to-swamy-swaroopananda-25-194915.html
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.