Publish Date:Aug 27, 2024
ఎపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) పై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల టీటీడీలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోణలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు.
ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలకూ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలాగే అంతకు ముందు చైర్మన్, ఈవోగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు సమాచారం.
సాధారణంగా టీటీడీలో ప్రతి ఏటా సుమారు రూ.300 కోట్ల వరకూ ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేస్తుంటారు.
అయితే ఈ క్రమంలో టెండర్లలో భారీ ముడుపులు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. గోవిందరాజస్వామి సత్రాలకు రూ.420 కోట్లు, స్విమ్స్‌కు రూ.77 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపుపై విజిలెన్స్ అధికారులు ..ముఖ్య గణాంక అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. టీటీడీలో ఆర్ధిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/notices-to-former-ttd-ceo-karunakar-reddy-and-evo-dharma-reddy-25-183666.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు