హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. కేసీఆర్‌కు గట్టి షాక్ తగిలింది. ఈటల రాజేందరే హుజురాబాద్ రారాజుగా నిలిచారు. హోరాహోరీగా జరిగిన పోరులో ప్రజలు భారీ మెజార్టీతో ఈటలను గెలిపించారు. టీఆర్ఎస్‌కు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా కర్రు కాల్చి వాత పెట్టారు. గెలిచాక ఇక తన నెక్ట్స్ టార్గెట్ గజ్వేల్, సిద్ధిపేటలేనని సవాల్ చేశారు రాజేందర్. ప్రగతి భవన్ గోడలు కూల్చే వరకూ తగ్గేదే లేదంటూ సమరోత్సాహంతో ఉన్నారు ఈటల. కట్ చేస్తే.. ఈటలపై భూకబ్జా కేసు మళ్లీ వేగం పుంజుకోవడం కలకలం రేపుతోంది. ఇది పక్కా కక్ష్య సాధింపు చర్యలేనంటున్నారు.
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న సర్వేకు హాజరుకావాలని ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి, కుమారుడు నితిన్‌రెడ్డిలకు తూప్రాన్ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.
మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్‌పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్టు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కొవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 18న సర్వే జరిపేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/notices-to-etela-family-members-on-land-survey-36-126005.html
ఈ విషయంలో భారత్ మాత్రం ఆచితూచి స్పందించింది. అమెరికా చర్యను నేరుగా ఖండించలేదు. మొక్కుబడి తంతు అన్నట్లు వెనిజువేలా ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అన్ని పక్షాలూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనీ సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
వెనిజువేలా రాజథాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు.
తాను అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిననీ, దేశాధ్యక్షుడిననీ పేర్కొన్న మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు.
మల్లోజుల, చంద్రన్న వంటి కీలక నేతలు లొంగిపోయిన తర్వాతే పార్టీ పరిస్థితి ఎంత బలహీనంగా మారిందో పూర్తిగా అర్థమైందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దాడులు చేపట్టడంతో పాటు, పలు రాష్ట్రాల నుంచి ఒకేసారి ఎదురైన ఆపరేషన్ల కారణంగా మావోయిస్టు పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బతిందన్నారు.
పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే కులాలు వేరు అన్న కారణంతో ప్రణయ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన లావణ్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.
ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్.
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
నదీజలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు
ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి.
వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ సమ్మెకు పిలుపు నిచ్చింది.