ఉండవల్లి కాదు ఊసరవెల్లి..!

Publish Date:Feb 10, 2025

Advertisement

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితుడు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా  ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు.

ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లి ఉలకలేదు, పలకలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన వితండ వాదంతో ఆయన తరఫున మాట్లాడే వారు. ఈ నేపథ్యంలో ఆయన తన వాదనను తానే ఖండించుకుంటూ గతంలో తాను ఔనన్న దానికి కాదంటూ, కాదన్న దానికి ఔనంటూ అపర ఊసరవెల్లిలా మారిపోయారు.  సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్ కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ అప్పట్లో నవ్వుల పాలయ్యాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు.   తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను  ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. 

మరీ ముఖ్యంగా జగన్ అధికారంలో ఉండగా స్కిల్ కేసు అంటూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చి నిరసన బాట పడితే.. ఒక్క ఉండవల్లి మాత్రం స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.  స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించినా, అపర మేధావి ఉండవల్లికి మాత్రం అందులో న్యాయం కనిపించింది. తన రాజకీయ గురువు వైఎస్ జగన్ కు అండగా నిలవడమే తక్షణ కర్తవ్యంగా అనిపించింది.  వాస్తవానికి స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందు అరెస్టు చేసి ఆనక తీరిగ్గా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నాలు ప్రారం భించామని చెప్పుకుంది.  
అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు.  ఇలా ఒక్కటనేమిటి.. జగన్ ఐదేళ్ల పాలనలో జగన్ కు వత్తాసు పలకడానికి మాత్రమే ఈ స్వయం ప్రకటిత మేధావి, రాజకీయ సన్యాసం పుచ్చుకున్న యోగి పుంగవుడు మీడియా ముందుకు వచ్చే వారు. అందు కోసం తటస్థుడనన్న ముద్ర వేసుకునే వారు. సరే జనం తీర్పుతో జగన్ అధికారం కోల్పోయారు. అత్యంత అవమానకరమైన ఓటమి వైసీపీకి జనం కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇక ఓటమి తరువాత వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. చివరాఖరికి  పార్టీలో నంబర్ 2, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు, ఏ2 అయిన విజయసాయి కూడా వైసీపీని వీడి పోయారు.

దీంతో ఇక ఉండవల్లి రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ఇంక ముసుగులెందుకు అనుకున్నారో ఏమో, రాజకీయ సన్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వైసీపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లోకి దూకేస్తానం టున్నారు. గత రెండు రోజులుగా  ఉండవల్లి వైసీపీలో చేరికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే వాస్తవమైతే మేధావి ముసుగు తొలగించుకుని ఉండవల్లి తనలోని జగన్ భక్త హనుమాన్ ను జనానికి చూపించినట్లే. ఉండవల్లి ప్రజా నాయకుడేం కాదు. మీడయా సమావేశాలలో గంటల తరబడి ప్రసంగించగలరేమో కానీ, బహిరంగ సభ పెడితే ఆయన ప్రసంగం వినడానికి పట్టుమని పది మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఉండవల్లి వైసీపీ గూటికి చేరితే ఆయన మీడియా సమావేశాలకూ క్రెడిబులిటీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన వైసీపీ గూటికి చేరడమంటే.. తెలుగుదేశం కూటమి నెత్తిన పాలు పోసినట్లేనంటున్నారు. 

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.