Publish Date:Oct 17, 2025
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడం.. పరిశ్రమల స్థాపనకు ఏపీని మించిన రాష్ట్రం లేదని పారిశ్రామిక వేత్తలు భావిస్తుండటం పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి కంటగింపుగా మారింది. దీంతో ఉన్నవీలేనివీ కల్పించి ఏపీపై దుష్ప్రచారానికి తెగబడుతున్నది ఆ రాష్ట్రం. ఈ విషయంలో కర్నాటక మంత్రులే ముందువరుసలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కాదని మరీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఏపీకి క్యూ కడుతున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాలకు కడుపుమంటగా ఉంటుంది.
అయితే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కడుపుమంట మరీ ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర ఐటీ మంత్రి ఏపీలోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుచిత రాయితీలు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమ వేదికగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. గూగుల్ వైజాగ్ నే ఎంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల రాయతీలు ఇవ్వడమేననీ, అలాగే రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం రీయింబర్స్ మెంట్, భూమి ధరపై పాతిక శాతం డిస్కౌంట్, ఉచిత విద్యుత్ ట్రాన్స్ మిషన్, వాటర్ టారిఫ్ పై పాతిక శాతం రాయతీలు ఇచ్చిందనీ..ఈ స్థాయిలో రాయితీలు ఇచ్చిన రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయడం ఖాయమని ఖర్గే వ్యాఖ్యానించారు. నిస్సందేహంగా ఆయన వ్యాఖ్యలు ఏపీకి గూగుల్ వచ్చిందన్న కడుపుమంటతోనే అన్నది ఎవరికైనా సులువుగా అర్ధమైపోతుంది.
కర్నాటక మంత్రి ఖర్గే వ్యాఖ్యలపై ఏపీ ఐటీ మంత్రి దీటైన బదులిచ్చారు. ఎక్కడా కర్నాటక పేరు కానీ, ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే పేరుకానీ ప్రస్తావించకుండానే లోకేష్ ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. ఈ మేరకు లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ‘ఏపీలో పచ్చళ్లు మాత్రమే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే’ అని పేర్కొన్నారు. ఆ ఘాటును, వేడిని పొరుగురాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/not-only-food-andhra-investment-alsp-spicy-25-208087.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.