ఉత్తర భారతాన్ని గజగజలాడిస్తున్న చలి పులి... మైనస్ డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
Publish Date:Jan 13, 2026
Advertisement
ఉత్తర భారతాన్ని చలి పులి గజగజలాడిస్తోంది. పలు ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఢిల్లీలో మంగళవారం (జనవరి 13) అత్యల్పంగా 2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత. ఇక గాలిలో తేమ శాతం వంద శాతానికి చేరింది. ఇక పంజాబ్, హర్యానాలు కూడా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగ మంచుతో అల్లల్లాడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. పంజాబ్‌లోని భటిండాలో 0.6 డిగ్రీలు, అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో ఒక డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. అయితే గురుగ్రామ్ శివారు ప్రాంతాలలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా రాజస్థాన్‌లోని ఫతేపూర్ శేఖావతిలో మైనస్ 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
http://www.teluguone.com/news/content/north-india-freze-with-minimum-temporatiors-36-212458.html





