మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు.. వైసీపీ నేతలకు బిగిసిన ఉచ్చు!

Publish Date:Aug 3, 2024

Advertisement

అన్నమయ్య జిల్లా, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి  నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. వీరంతా వైసీపీ నేతలే కావడం గమనార్హం.

మదలపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని తొలి నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ఆ ఆరోపణలలో బలం ఉందని తేలిపోయింది.  వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. . కేసు వివరాలను మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు.

మొత్తం8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ   కోయ ప్రవీణ్ ప్రకటించిన సంగతిత  తెలిసిందే. ఇప్పుడు  తాజాగా ఈ నాలుగురిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.    నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర  భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ఇంటి నుంచి 8 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో  కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్త్రాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి. మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల  ట్యాంపరింగ్, దొంగతనం, చోరీ సొత్తు కలిగి ఉండటంతో పాటు సాక్ష్యాలు మాయం చేయడం, నిందితులకు సహకరించడం వంటి ఆరోపణలపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు  చేశారు.

ఇలా ఉండగా  నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన వైసీపీ నేతలు యాంటిసిపేటరీ బెయిలు కోసం కర్నూలు కోర్టును ఆశ్రయించారు.  తమపై నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని, అలాగే  తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వీరు కర్నూలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా ఉండగా ఈ వైసీపీ నేతల నివాసాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లే సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్ధం కేసులో కీలకమని పోలీసులు చెబుతున్నారు.   

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.