పొన్నవోలు అనుచరుడికి నామినేటెడ్ పోస్టు!

Publish Date:May 6, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియమకాలు ఎలా జరుగుతున్నాయన్న అయోమయం నెలకొని ఉంది. వైసీపీ సానుభూతిపరులకు పదవులు కట్టబెట్టడం, ఆ తరువాత తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకుని ఆ పదవి నుంచి సదరు సానుభూతి పరుడిని పీకేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే ఒక న్యాయ వాదికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. అలా కట్టబెట్టిన ఒక రోజులోనే ఆ పదవి నుంచి ఆ న్యాయవాదిని పీకేసింది. ఎందుకయ్యా అంటే ఆ న్యాయవాది వైసీపీయుడు కావడమే. అసలు ఏదీ చూసుకోకుండా, ఎవరికి ఏ పదవి కట్టబెడుతున్నామన్నది తెలియకుండానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియామకాలు జరుగుతున్నాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక ప్రహసనంగా మారిందా అంటే తాజా పరిణామాన్ని గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం, మిత్రపక్షాల నేతల కంటే వైసీపీ సానుభూతి పరులకే పెద్ద పీట వేస్తున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా  ఒక న్యాయవాదిని ప్రభుత్వం కీలక నామినేటెడ్ పోస్టులో నియమించింది.  ఆ తరువాత  ఆ న్యాయవాది వైసీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ కేటాయించిన నామినేటెడ్ పదవిని రద్దు చేసింది.  

విషయంలోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన న్యాయవాది జి. దినేశ్ కుమార్ రెడ్డిని ఎస్‌పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ (బీఎల్‌సీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే సదరు న్యాయవాది జగన్ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పని చేసిన పొన్నవోలు అసిస్టెంట్ కావడమే. పొన్నవోలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన వైసీపీ నేతల కేసుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తుంటారు. అటువంటి పొన్నవోలు అసిస్టెంట్ దినేశ్ కుమార్ రెడ్డికి  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు కట్టబెట్టడమేంటి? అంటే తెలుగుదేశం శ్రేణులు ఓ రేంజ్ లో ఫైరయ్యాయి. 

 వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘటనలో చంద్రబాబు సహా వందలాది మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దినేశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అసలే పొన్నవోలు అసిస్టెంట్, ఆపై చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులు వాదించిన వ్యక్తికి ముందు వెనుకలు చూసుకోకుండా నామినేటెడ్ పోస్టు ఎలా కట్టబెట్టారన్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అయ్యింది.  దీనిపై తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. దీంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన దీనిని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడంతో దినేష్ కుమార్ నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేష్ కుమార్ నియామకం రద్దును స్వాగతిస్తూనే తెలుగుదేశం శ్రేణులు అసలా నియామకానికి సిఫారసు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పారు్టీ అధిష్ఠానం కూడా ఇదే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.   

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.