ఫిజిక్స్.లో విశేష కృషి చేసినందుకు ఈ సంవత్సరం ఇద్దరికి నోబెల్ బహుమతి దక్కింది. జాన్ జె. హోప్ఫిల్డ్, జెర్రీ ఈ. హింటన్‌లకు ఈ ప్రతిష్ఠాత్కక పురస్కారం లభించింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకు ఈ అత్యున్నత పురస్కారం వీరిద్దరినీ వరించింది. గత సంవత్సరం ఫిజిక్స్.లో ఈ బహుమతి ముగ్గురిని వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ సైంటిస్ట్ పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతి వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్ ఈ బహుమతి అందుకున్నారు. 1901 నుంచి ఇప్పటివరకు 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు.
మెడికల్ విభాగంతో మొదలైన నోబెల్ బహుమతుల ప్రకటన అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. నిన్న (సోమవారం) వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు (మంగళవారం) ఫిజిక్స్.లో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం కెమిస్ట్రీ, గురువారం లిటరేచర్ విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేత, అక్టోబర్ 14న ఎకనామిక్స్ నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
స్వీటన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, బిజినెస్‌మన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల అమెరికన్ డాలర్లు) నగదు అందుతుంది. ఈ బహుమతులను ఈ ఏడాది డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nobel-prize-in-physics-2024-awarded-to-john-j-hopfield-geoffrey-e-hinton-25-186485.html
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!