అభివృద్ధీ, సంక్షేమం రెండూ డొల్లే.. బాబు సవాల్ తో బయటపడ్డ జగన్ నిర్వాకం!

Publish Date:Feb 20, 2024

Advertisement

చంద్రబాబు సవాల్ తో వైసీపీ గొప్పల డొల్ల తనం బయటపడిపోయింది.  ఏపీ సీఎం జగన్ పాలనపై  తెలుగుదేశం అధినేత చంద్రబాబు   ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందనీ, రెక్కలు విరిగిన ఫ్యాన్ ను స్క్రాప్ లో పడేయడానికి జనం రెడీ అయిపోయారనీ పేర్కొన్నారు.  జగన్‌ది విధ్వంసక పాలన అని ఫైర్ అయిన చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు.  

బాదుడే బాదుడు  పాలనతో ప్రజల రక్తం పీల్చేసి,   విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటూ  అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరన్న చంద్రబాబు..   బూటకపు ప్రసంగాలు కట్టిపెట్టి దమ్ముంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  ప్లేస్, టైం జగన్ నే డిసైడ్ చేసుకోమన్నారు.  ఎక్కడికి, ఎప్పుడు ర మ్మంటే అప్పుడు వస్తాననీ, దేనిమీదైనా చర్చకు రెడీ అని చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ తో జగన్ శిబిరంలో వణుకు మొదలైంది. జరిగిన అభివృద్ధిని చూపలేక, చెప్పలేక, అరకొరగా అందించిన సంక్షేమాన్ని చూపించుకోలేక, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చెప్పుకుని ఇప్పుడు అమలు కాని హామీల చిట్టాపై ఏ ముఖం పెట్టుకు మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ గంగవెర్రులెత్తిపోతున్నది. 

దీంతో చంద్రబాబు సవాల్ ను తిరస్కరించేందుకు కారణాలను వెతుక్కుంటోంది. హామీలు ఎందుకు అమలు చేయలేదన్న విషయంపై లాజిక్ కూడా అందకుండా అడ్డదిడ్డమైన జవాబులు ఇచ్చేయడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన సజ్జల జగన్ తరఫున రంగం మీదకు వచ్చేశారు. జగన్ వంటి గొప్పనాయకుడికి చంద్రబాబుతో బహిరంగ చర్చకు రావలసిన అవసరం లేదని వాక్రుచ్చారు. అంతేనా ఇచ్చిన హామీలలో 99శాతానికి పైగా అమలు చేశామని చెప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అన్ని వాగ్దానాలనూ తుంగలోకి తొక్కారనీ, అయితే జగన్ మాత్రం అలా కాకుండా నెరవేర్చలేని వాగ్దానాలపై వివరణ ఇచ్చుకున్నారనీ భాష్యం చెప్పారు. అంటే ఆయన చెప్పిందెలా ఉందంటే.. వాగ్దానాల అమలు వైఫల్యాలను అంగీకరించడమే అమలు చేయడమన్నట్లుగా ఉంది. జగన్ గత ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధం, అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు వంటి ఎన్నో ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. మరి ఇప్పుడు చెబుతున్నట్లు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చారా అంటే లేదని చెప్పేశాంగా అంటే నెరవేర్చేసినట్లే అని సజ్జల అంటున్నారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్నీ, అడ్డగోలు పాలనను ఇలాగే సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ కూడా అదే పని చేస్తున్నారు. మద్య నిషేధం జగన్ కన్న కల అని అది సాకారం అయ్యే అవకాశం లేదనీ చెప్పకనే చెప్పిన సజ్జల ఇప్పుడు వచ్చే పాతికేళ్ల వరకూ మద్యం విక్రయాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ సంక్షేమం కోసం నిధులు సమకూర్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాగే జగన్ కు అవగాహన లేకపోవడం వల్లే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారనీ, అవగాహన వచ్చిన తరువాత సిపీఎస్ రద్దు అసంబద్ధమని  తేలడంతో రద్దు చేయడం లేదనీ చెబుతున్నారు. 

అసలు వాస్తవమేమిటంటే.. జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే మేనిఫెస్టోలో పొందు పరిచిన హామీలలో ఎనభై శాతానికి పైగా అమలు చేసేశామని ప్రకటించేసుకున్నారు. అంటే అప్పటి నుంచే హామీల అమలు కంటే అమలు చేసేశామన్న ప్రచారానికే పెద్ద పీట వేశారు. నిజానికి జగన్ ఇచ్చిన హామీలలో అమలు చేసినవి పది శాతం కూడా ఉండవు. కానీ గోబెల్స్ ప్రచారంతో జనాలను నమ్మించాలనీ, నమ్మించేయగలమన్న అతి విశ్వాసంతో తాము చెప్పిందే వేదమన్నట్లుగా ఇంత కాలం వ్యవహరిస్తూ వచ్చారు.     

అయితే, ప్రతిపక్ష పార్టీలు, అసంతృప్త ప్రజలు జగన్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం పది శాతం మాత్రమేనని గణాంకాలతో సహా చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా పాదయాత్రలో ఆగిన ప్రతిచోటా ఒక హామీ అన్నట్లుగా జగన్ ఎడా పెడా హామీలిచ్చేశారు. అలా తన పాదయాత్ర నుండి ఎన్నికల సమయంలో సభల వరకూ మొత్తం జగన్ 650కి పైగా హామీలు ఇచ్చారని ప్రతిపక్షాలు లెక్క తేల్చారు. అయితే వాటిలో కేవలం పది శాతం మాత్రమే అమలయ్యాయని ఆధారాలతో సహా చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా  జగన్ తన నోటి నుండి చెప్పి మరచిన వాటిని ఆధారాలతో సహా బయట పెడుతూ ఇది హామీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే వైసీపీ చెప్పుకుంటున్న అమలు చేసిన 99 శాతం హామీలు ఏమిటో  ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పిన వాటిలో ప్రధానమైనవి సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, 45 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ వంటివి  అమలయ్యాయా అని నిలదీస్తున్నారు. అలా జగన్ అమలు చేయని హామీల జాబితా కొండవీటి చాంతాడంత ఉందని సోదాహరణంగా వివరిస్తున్నారు.  రాష్ట్రంలో మద్యం అంటే  స్టార్ హోటళ్లలో దొరికే వస్తువుగా పరిమితం చేస్తానని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోగా మద్యం ఆదాయాన్ని కూడా వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఇక మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సంగతి ప్రస్తావించడమే దండుగ. రాష్ట్రంలో  ఉద్యోగమంటే వాలంటీర్, సచివాలయాలనే చూపిస్తున్నారు. 

మరో కీలకమైన హామీ సీపీఎస్ రద్దు. దీని గురించి వెళ్లిన ప్రతి చోటా చెప్పిన జగన్.. ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెపున్నారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని ఈ హామీని అటకెక్కించారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.3 వేలు పెన్షన్ అన్నారు. కానీ, రియాలిటీలో 63 దాటిన వాళ్ళకే సవాలక్ష కొర్రీలు పెట్టి అదీ ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు.  అదీ ఇప్పటికీ చెప్పిన రూ.3 వేలు కాలేదు. ఇలా, జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి, బహిరంగ సభలలో ఇచ్చిన హామీలే వందలలో ఉండగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇంకా వేలల్లో , లక్షల్లో ఉన్నాయి. వీటితో పాటు గత ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ ప్రోత్సాహకాలు లాంటి ఉపయోగకరమైన పథకాలకు నిధులు లేకుండా చేసి వాటిని నీరుగార్చేశారు. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అబద్దాల ప్రచారాన్ని చేసేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు సవాల్ చేసే సరికి బిక్కచచ్చిపోయి లాజిక్ కు అందని వాదనతో బహిరంగ చర్చకు నిరాకరిస్తూ ముఖం చాటేస్తున్నారు.  

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.