సర్కార్ వ్యతిరేక ఓటు చీలదుగాక చీలదు.. జనసేనాని పునరుద్ఘాటన

Publish Date:Mar 31, 2023

Advertisement

ఓ వంక  ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. అధికార వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అనివార్యంగా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని  ఇప్పటికే  ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి కుంగదీసింది. మరో వంక, తెలుగు దేశం,జనసేన పొత్తు భయపెడుతోంది. అందుకే, ఏదో విధంగా ఇంచుమించుగా ఖరారైన టీడీపీ, జనసేన పొత్తును తుంచేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకోసం  ఓ వంక ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్న జగన్ రెడ్డి, మరోవంక జనసేన, టీడీపీ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు,వదంతులు పుట్టిస్తున్నారు. అబద్ధాల హరిశ్చంద్రులు అనదగ్గ, మంత్రులు, మాజీ మంత్రులను వదిలి, టీడీపీ, జనసేన నాయకుల మధ్య విబేధాలు సృష్టించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపద్యంలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోమారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని, స్పష్టం చేశారు. అలాగే వైసీపీ ట్రాప్‌లో పడొద్దని జనసైనికుల్ని అప్రమత్తం చేశారు. పొత్తుల విషయంలో జనసైనికులు డైవర్ట్ కావొద్దని.. సోషల్ మీడియాతో పాటూ బయట జరుగుతున్న అసత్య  ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే, జనసేన లక్షమని అందుకోసం  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలా పొత్తులు ఉంటాయని మరోమారు విస్పష్టంగా చెప్పారు. నిజానికి గతంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలినవ్వం అని చెప్పారు. అందుకే వైఎస్సార్‌సీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జనసేన పార్టీతో పాటు విపక్ష నేతల పేర్లతో తప్పుడు ప్రకటనలతో గందరగోళం మొదలైందని. ఇదంతా వైసీపీ పొలిటికల్ గేమ్ గా పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్  సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని.. తప్పుడు ప్రకటనలు, సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసైనికులకు సూచించారని అంటున్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వచ్చే  ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకుంటారని.. అందుకు తగ్గట్లే వ్యూహాలను రూపొందిస్తారని పార్టీ నాయకులు అంటున్నారు.   పొత్తులపై ఆయా రాజకీయ వేదికలపై చర్చించి నిర్ణయం ఉంటుంది అంటున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ సవాల్ చేస్తోంది. జనసే పార్టీ కూడా అదే రేంజ్‌లో వారికి కౌంటర్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా వైఎస్సార్‌సీపీ ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారో అది తనుకు తెలుసు అని వ్యాఖ్యానించారు. కానీ వారు వద్దనుకుంటున్నదే జరుగుతుందని,  వైసీపీ వ్యతిరేక ఓటు వృథా కానివ్వనీ ఇవటీవల జరిగిన ఆవిర్భావ సభలో మరోసారి తేల్చి చెప్పారు.

రాష్ట్రం కోసం మంచి నిర్ణయం తీసుకుంటాననీ.. జనసైనికులు తనను నమ్మాలన్నారు. మచిలీపట్నం సభలోనే అన్ని అంశాలపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై రెచ్చగొట్టేలా నాయకులు చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా బాగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు లేదని.. జనసేనకు ఇచ్చే సీట్లు ఇవేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు, నాగబాబు మధ్య వార్ నడుస్తోందని కొన్ని ఛానల్స్ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ ప్రకటనలు నిజమని కొందరు జనసైనికులు భావిస్తున్నారు. దీంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని జనసేన పార్టీ స్పష్టం చేసింది

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.