సార్వత్రిక ఎన్నికల ముంగిటా ఇండియాలో కనిపించని ఐక్యత!

Publish Date:Jan 2, 2024

Advertisement

సార్వత్రిక ఎన్నిక  సమయం దగ్గర పడుతున్న తరుణంగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన హిందీ రాష్ట్రాలను కోల్పోవడం  ఆ పార్టీ ఆశలే కాకుండా, ఇండియా కూటమి ఆశలు కూడా నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది.  28 పార్టీల ఇండియా కూటమిలో ఇంతవరకూ ఉమ్మడి అజెండా రూపుదిద్దుకోకపోవడం, తాజా ఎన్నికలలో ఆ కూటమికి నేతృత్వం వహించాల్సిన పార్టీ కీలక రాష్ట్రాలలో ఓటమి పాలు కావడంతో ఇండియా కూటమి కొనసాగే అంశమే సందిగ్ధంలో పడింది.  దీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీకి దీటైన పోటీగా  అభ్యర్థిని ఎంపిక చేసుకోలేని ఆశక్తత ఎటూ ఇండియా కూటమికి ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం లేదన్నది వాస్తవం. ఇప్పుడు తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కనుచూపు మేరలో ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని స్సష్టం చేసింది. అయినా కూడా రాజకీయ అవసరాలు ఇండియా కూటమిని ఇన్ టాక్ట్ గా ఉంచుతుందనడంలో సందేహం లేదు. 

ఇక ఇండియా కూటమికి ఎవరు ఔనన్నాకాదన్నా నాయకత్వం వహించాల్సింది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ను కలుపుకోకుండా మూడు, నాలుగు అంటూ ఎన్ని ప్రత్యామ్నాయాలు తెరమీదకు వచ్చినా ప్రయోజనం ఉండదు. అయితే కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలు కూడా ప్రధాని అభ్యర్థి విషయానికి వచ్చేసరిని భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 
ఈ పరిస్థితులలో లోక్ సభ ఎన్నికల నాటికి  ఇండియా కూటమి ఇన్ ాక్ట్ గా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకు ప్రధాన కారణం కూటమిలోని పార్టీ నాయకులలో  ఎవరూ కూడా మోడీకి దీటైన పోటీ ఇవ్వగల స్టేచర్ ఉన్న వారు లేకపోవడమే అని అంటున్నారు.  2014, 2019 సార్వత్రిక ఎన్నికల లాగే ఈ సారి కూడా  బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా, తన ప్రధాన ఎన్నికల ప్రచార సారథిగా మోదీని ప్రజల ముందుంచడం ఖాయమని అర్థం అవుతూనే ఉంది. అలాగే విపక్ష కూటమి అలా ప్రకటించగలదా అన్న సవాల్ ను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. 2014లో ప్రతిపక్ష కూటమి ‘మై నహీ, హమ్’అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చినా, మధ్యలోనే ఆ నినాదాన్ని వదిలేశారు.  నాయకత్వం, ప్రధాని అభ్యర్థి వంటి విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం పక్కన పెడితే ఇండియా కూటమిలో  అనుభవజ్ణులకు కొరత లేదు. అయితే అందరూ సమష్టిగా పని చేయడం విషయంలో మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జనంలో ఇండియా కూటమి ఐక్యతపై నమ్మకాన్ని కలిగించడంలో విఫలమౌతున్నారు.  అయితే అటు అధికార కూటమి ఎన్డీయేలో కూడా పరిస్థితి ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగానే ఉంది. 

ఎందుకంటే పేరుకు ఎన్డీయేయే కానీ, బీజేపీతో మైత్రికి ఇప్పుటికీ సుముఖంగా ఉన్న పార్టీల సంఖ్య ఎంతున్నా చట్ట సభలలో వాటి ప్రాతినిథ్యం సింగిల్ డిజిట్ కూడా దాటదు.  ఔను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) కథ దాదాపు  ముగిసినట్లే.. ఇప్పుడు ఆ పేరు మీద బీజేపీ ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉండే పార్టీలు వినా మరేవీ లేవు.  ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయి సారథ్యంలో 24 పార్టీల కూటమిగా  కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎ చిత్రానికి శుభం కార్డు పడిపోయింది.   నిన్నమొన్నటి వరకూ జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యు) ఎన్డీయే కూటమిలో కొనసాగడంతో  ఎన్డీయే ఉనికి మాత్రంగానైనా ఉంది. కానీ  ఎప్పుడైతే నితీష్ కుమార్, కూటమికి గుడ్ బై చెప్పేశారో అప్పుడే ఎన్డీయే కథ ముగిసింది.  వాస్తవానికి   2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ కంచికి చేరడానికి రెడీ అయ్యింది. ఇంచు మించుగా మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272) కంటే 10 సీట్లు అదనంగా (282) గెలిచి, మూడు దశాబ్దాల చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరింది.  

అయినా 2014లో తిరిగి 2019లో బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చింది.  

2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ, ఇప్పుడు ఆ చిన్నా  చితక పార్టీలలో కొన్ని మాత్రమే కూటమిలో మిగిలాయి. బీజేపీ సహజ మిత్ర పక్షాలు శివసేన, అకాలీ దళ్   అలాగే  జేడీ(యు) సహా ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎన్డీఎ గూడు వదిలి పోయాయి.. ఇక  ఇప్పుడు ఎన్డీఎలో ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా  ప్రభావం చూపగలిగే పార్టీలు కావు. ఏ పార్టీకీ కూడా లోక్ సభలో  ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.   బీజేపీకి పెత్తందారీ పోకడలకు విసిగి వేసారి మిత్రపక్షాలన్నీ ఎన్డీయేను వీడిపోతున్నాయి?  అటువంటి పరిస్థితుల్లో అవకాశాలను అందిపుచ్చుకుని మిత్రుల సంఖ్యను పెంచుకోవలసిన కాంగ్రెస్  ఆ విషయంలో పెద్దగా విజయం సాధించలేకపోతున్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మాత్రమే. అందుకే ఇండియా కూటమి పట్ల ఇప్పుడు జనంలో సానుకూలత వ్యక్తం   అవుతున్నది. ఆ సానుకూలతను ఓట్లుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ త్యాగాలకూ సిద్ధం కావాలి. మిత్రపక్షాల అనుమానాలను నివృత్తి చేసి వాటిని కలుపుకుని పోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరగనుందో? 

By
en-us Political News

  
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.