తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ పెరంబదూర్, తిరుచిరాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచీ విజయం సాధించారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ తాజాగా తిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన కృతజ్ణతా సభలో చేసిన ప్రకటన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తిరుచిరాపల్లి ఉప ఎన్నికలో టీవీకే తరఫున స్థానిక అభ్యర్థి మాత్రమే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఆయన విస్పష్టంగా చెప్పారు. పార్టీ అధినేత స్థానిక నేతకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో, గ్రౌండ్ లెవెల్లో టీవీకే క్యాడర్ మరియు స్థానిక కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ఉండటంతో ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ బై-ఎలక్షన్ ద్వారా టీవీకే ప్రభావాన్ని దెబ్బతీయాలని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహాలకు చెక్ పెట్టే దిశగా విజయ్ ముందుకు సాగుతున్నారనడానికి లారెన్స్ కు టికెట్ నిరాకరించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక నేతకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ విజయ్ అవినీతి రహిత పాలన, సామాజిక న్యాయంపై ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారన్న భావన రాజకీయవర్గాలలో సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తిరుచ్చిలో స్థానికునికే పార్టీ టికెట్ ప్రకటన ఈ ఉప ఎన్నికలో టీవీకే విజయాన్ని దాదాపు ఖరారు చేసేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-ticket-for-cm-vijays-friend-raghava-lawrence-39-224720.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!