తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక.. సీఎం విజయ్ ఫ్రెండ్ రాఘవ లారెన్స్ కు నో టికెట్?

Publish Date:Jul 1, 2026

Advertisement

తమిళనాడు  ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ పెరంబదూర్, తిరుచిరాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచీ విజయం సాధించారు.  

దీంతో  తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ తాజాగా తిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన కృతజ్ణతా సభలో చేసిన ప్రకటన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తిరుచిరాపల్లి ఉప ఎన్నికలో టీవీకే తరఫున స్థానిక అభ్యర్థి మాత్రమే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఆయన విస్పష్టంగా చెప్పారు.   పార్టీ అధినేత స్థానిక నేతకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో, గ్రౌండ్ లెవెల్‌లో టీవీకే క్యాడర్ మరియు స్థానిక కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  

విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ఉండటంతో ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ బై-ఎలక్షన్ ద్వారా టీవీకే ప్రభావాన్ని దెబ్బతీయాలని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహాలకు చెక్ పెట్టే దిశగా విజయ్ ముందుకు సాగుతున్నారనడానికి లారెన్స్ కు టికెట్ నిరాకరించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక నేతకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ   విజయ్ అవినీతి రహిత పాలన,  సామాజిక న్యాయంపై ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారన్న భావన రాజకీయవర్గాలలో సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తిరుచ్చిలో స్థానికునికే పార్టీ టికెట్ ప్రకటన ఈ ఉప ఎన్నికలో టీవీకే విజయాన్ని దాదాపు ఖరారు చేసేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.