సజ్జల బాధ..ఓదార్పు ఏది?

Publish Date:Jan 22, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో పెత్తనం, పెత్తందారి తనం చేసేవారెవరైనా ఉన్నారంటే అది సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే.  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ కీలక నిర్ణయాన్ని ప్రకటించాలన్నీ, ప్రధాన  విధానాలను వివరించాలన్నా, నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ఉంచాలా, మార్చేయాలా? ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నిరాకరించాలి వంటి ప్రతి విషయంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరించేది సజ్జల మాత్రమేనని అందరికీ తెలిసిందే.  

అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తనను చాలా చాలా బాధపెట్టాయని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. తననే కాదు.. సాక్షాత్తూ షర్మిల సోదరుడు జగన్ ను, పార్టీ నేతలు, కార్యకర్తలనూ కూడా షర్మిల వ్యాఖ్యలు బాధించాయని ఆయన చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలనూ తూర్పారపట్టడం, జగన్ సర్కార్ తప్పిదాలను సమర్ధించడం తప్ప మరో మాట మాట్లాడని సజ్జల తొలి సారిగా షర్మిల వ్యాఖ్యలు బాధించాయంటూ తెగబాధపడిపోయారు.  

ఇంత కాలం వైసీపీ నేతలు వాడిన బాష, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై చేసిన దూష ణలను ఒక్క సారి కూడా మీడియా ముందుకు వచ్చి ఖండిచని సజ్జల..  షర్మిల  వైఎస్ జగన్ సర్కార్ తప్పిదాలను, ఆర్థిక అరాచకత్వాన్ని, జగన్ హయాంలో రాష్ట్రంలో కనిపించని ప్రగతిని, సరిగ్గా పంపిణీ కాని సంక్షేమాన్ని ప్రశ్నించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రషర్మిల వాడిన భాష సరికాదంటూ సూక్తులు చెప్పారు. ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయడంగా అభివర్ణించారు. అసలు ఆమె కాంగ్రెస్ గూటికి చేరడమే తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ   వైఎస్‌ కుటుంబానికి  ఎంతో ద్రోహం చేసిందని చెప్పారు. 

అదే సమయంలో వైసీపీ విజయం కోసం, అన్న జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక చెల్లెలుగా షర్మిల పడిన శ్రమ, చేసిన త్యాగం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. తాను ఆ స్థానంలో కూర్చోవడానికి శ్రమపడి, చెమట చిందించి, కాళ్లు అరిగేలా నడిచి, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను రాష్ట్రం నుంచి తరిమేదాకా ఊరుకోని జగన్ ద్రోహం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  అంతెందుకు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆమె రాజకీయాలతో కానీ, ఆమె పార్టీతో కానీ వైసీపీకి కానీ జగన్ కు కానీ ఎటువంటి సంబంధం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ వైఎస్ కుటుంబంలో ఆమె ఏకాకి అని తానే స్వయంగా చాటిన విషయం పాపం సజ్జలకు గుర్తు రాలేదు.  

ఇక తెలంగాణలో పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరులు షర్మిలకు అందకుండా చేసిన విషయమూ గుర్తు రాలేదు. ఇప్పడు సొంత చెల్లి తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయం తాను తీసుకుంటే మాత్రం ఎక్కడలేని బాధా సజ్జలలో తన్నుకొచ్చేసోతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత చేసిన తొలి ప్రసంగంలో   జగన్ మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండటాన్నిప్రశ్నిస్తూ, ఆయన క్రైస్తవుడేనా అని ప్రశ్నించడాన్ని జగన్ పార్టీ తట్టుకోలేకపోతోందని అంటున్నారు. 

 ఇక షర్మిల ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారో లేదో అలా వైసీసీ సోషల్ మీడియా వింగ్ ఆమెను టార్గెట్ చేస్తూ దూషణల పర్వాన్ని ప్రారంభించేసింది. అంత దాకా ఎందుకు ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని, దారి మల్లించి వైసీపీ సర్కార్  నిర్బంధకాండను ప్రారంభించేసింది.  

జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా షర్మిల విమర్శలు నేరుగా సూటిగా ఉండటమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వాగ్దానాలను ఎత్తి చూపుతో, వాటిని నెరవేర్చడంలో ఎలా విఫలమయ్యారో పూసగుచ్చినట్లు వివరించడం సహజంగానే సజ్జలను బాధపెట్టింది.  షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలకు పరోక్షంగానైనా ఆహ్వానం పలికారు. ఇది సజ్జలను అమితంగా బాధపెట్టింది. సిట్టింగుల మార్పు పేరున చేస్తున్న ప్రయోగం కారణంగా ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకా మరింత మంది తమ దారి తాము చూసుకోవడానికి దిక్కులు వెతుకుతున్నారు. అటువంటి వారందరికీ తన ప్రసంగం ద్వారా షర్మిల కాంగ్రెస్ గేట్లు తెరిచే ఉన్నాయని చాటారు. వారికి మార్గం చూపడానికా అన్నట్లు తాను ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేరగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న కేవీపీ, రఘువీరా వంటి నేతలు షర్మిల పక్కన నిలబడి వైఎస్ రాజకీయ వారసురాలు ఆమె మాత్రమేనని చాటేశారు. దీంతో పార్టీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమన్న భయమే సజ్జలలో బాధకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో వైసీపీ నేతలూ, శ్రేణులే కాదు, అగ్రనాయకత్వం కూడా భయంతో వణికి పోతోందని సజ్జల బాధ లోకానికి చాటింది. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.