సొంత ఓటు ఒక్కటీ లేదు.. ఆయినా ఓట్లన్నీ ఆమెకే!

Publish Date:Jul 12, 2022

Advertisement

చిత్రం. నిజంగా ఇదొక విచిత్రం. ఆంధ్ర ప్రదేశ్’ అసెంబ్లీలో బీజేపీకి చోటు లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా లేరు, అసెంబ్లీలో ఆ పార్టీ  బలం సున్నా. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, ఏపీ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేదు, నిన్నమొన్నటి వరకు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన రాజ్యసభ సభ్యులు ఇద్దరు ముగ్గురున్నా, ఇప్పడు వారి పదవీ కాలం ముగిసిపోవడంతో, పార్లమెంట్ ఎగువ దిగువ సభల్లో, ఏ సభలోనూ  ఏపీ బీజేపీకి ఎంట్రీ లేదు. 
రాష్ట్రంలో ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ ఏదీ లేదు. అధికార, ప్రతిపక్షాలలో  (వైసీపీ, టీడీపీ)ఏదీ బీజేపీ మిత్ర పక్షం కాదు, మిత్ర పక్షం జనసేన పార్టీది   కూడా బీజేపీ పరిస్థితే .. ఒక్క ఎంపీ లేరు. ఒక్క ఎమ్మెల్యే లేరు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలో బీజేపీ, జనసేన పార్టీలలో దేనికీ ఓటు లేదు.  
అయినా, రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలోని ఓట్లలో ఒక్క ఓటు బీరు పోకుండా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూటమి ఖాతాలో చేరుతున్నాయి. అధికారికంగానా, అనదికారకంగానా అనేది పక్కన పెడితే అధికార వైసీపీ, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్మకు అడగక ముందే మద్దతు తెలిపింది. ఇప్పుడు తాజాగా, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా ఎన్డీఎ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. సో ... రాష్ట్రం నుంచి పోలయ్యే ప్రతి ఓటు ముర్ము ఖాతాలో చేరుతుంది. భారత రాజకీయాల్లో ఇదొక విధంగా విచిత్ర పరిస్థితి.

గతంలోనూ, ఒక రాష్ట్రంలో ఉన్నమొత్తం ఓట్లు ఒకే అభ్యర్ధికి పోలైన సందర్భాలు ఉంటే ఉండవచ్చును, కానీ, రాష్ట్రంలో ఓటే లేని పార్టీ / కూటమి అభ్యర్ధికి గంప గుత్తగా ఓట్లన్నీ పోలుకావడం, బహుశా రాష్ట్రపతి ఎన్నికల చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చును.  అదొకటి అలాఉంటే, జూలై 18 జరిగే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికలకు సమబందించి కొన్ని ఆసక్తి కర పరిణామాలు అయితే, చోటు చేస్కున్నాయి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూన్ 14 న, కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూలు ప్రకటించింది. అయినా, ఎన్డీఅభ్యర్ధి ఎవరైనా గెలుపు ముందుగానే ఖరారై పోవడం వలన, గెలుపు ఓటముల గురించి, పెద్దగా చర్చ జరగలేదు.

అయితే, అధికార, విపక్షాల అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత చిత్ర విచిత్ర పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక ఒక ప్రహసంగా సాగింది. ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు ఇలా ఒక్కొక్క పేరు తెర మీదకు వచ్చి తప్పుకుంటూ పోయింది. చివరకు, యశ్వంత్ సిన్హా ఉమ్మడి అభ్యర్ధిగా తెర మెడకు వచ్చారు.  

అయితే, బీజేపీ/ఎన్డీఎ గిరిజ మహిళ, ద్రౌపతి ముర్ముపేరును ప్రకటించిన తర్వాత, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్న పార్టీలు ఒకటికటిగా సారీ అంటూ చేయి వదిలేస్తున్నాయి. ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ముందుగా అనుకున్న విధంగానే ఏ కూటమిలోనూ లేని వైసీపీ, బీజేడీ (కారాణాలు ఏవైనా) ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. కానీ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలో కూడా ఒకటొకటిగా జారిపోతున్నాయి,

చివరకు యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రం ఝార్ఖండ్’ లో అధికారంలో ఉన్న యూపీఏ భాగస్వామ్య పార్టీ  జేఎంఎం ముర్ముకు మద్దతు ప్రకటించింది. యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రమే కాదు, సొంత పార్టీ, టీఎంసి కుడా, ఆయనను దూరంగానే ఉంచుతోంది.  ఆయన పేరును వెనకుండి ముందుకు తెచ్చిన టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ కూడా, యశ్వంత్ సిన్హాకు హ్యాండ్ ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. ద్రౌపతి ముర్ము పేరు ముందే ప్రకటించి ఉంటే, అసలు యశ్వంత్ సిన్హాను బరిలో  దించక పోదుమని, పరోక్షంగా, ముర్ముకు మద్దతు ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. అంతే కాకుండా గెలిచే అవకాశాలు ఎండీఎ అభ్యర్ధికే ఉన్నాయని, యశ్వత్ సిన్హాను పోటీ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే ఉత్తమం అనే సలహా ఇచ్చారా అన్నట్లుగా, మరో విధంగా సిన్హాను అవమానించే విధంగా ఓ ప్రకటన చేశారు. ప్రచారం పేరున బెంగాలుకు రావద్దని అన్నారు. చివరకు శివసేన రెండు వర్గాలు, బీజేపీ హార్డ్కోర్ శత్రు పక్షం  ఎస్పీ, ఎస్పీ చీలిక వర్గం ఎస్బీఎస్పీ , బీఎస్పీ, గోవాలో కాంగ్రెస్ చీలిక వర్గం ఇలా ఒకటికటిగా పార్టీలు, ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీలోనూ యశ్వంత్ సిన్హా కు సంపూర్ణ మద్దతు లభించే పరిస్థతి లేదని అంటున్నారు.  తెలంగాణలో పర్యటనలో యశ్వంత్ సిన్హా  తెరాస, కాంగ్రెస్ రాజకీయ వైరుధ్యాల కారణంగా కాంగ్రెస్ పార్టీని కలవకుండానే వెనక్కు వెళ్ళిపోయారు. 

ఇలా ఓ వంక ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు క్యూకట్టి ఎన్డీఎ అభ్యర్ధు ద్రౌపతి ముర్ముకు జై కొడుతున్నాయి. మరోవంక మద్దతు ఇస్తున్నపార్టీలు ఏవీ కూడా ఆయన్ని సొంతం చేసుకుంటున్నట్లు లేదు. తెరాస వంటి కొన్ని పార్టీలు ఇంకా యశ్వంత్ సిన్హా’కు మద్దతు తెలుపుతున్నా,చివరకు ఆత్మ ప్రభోధమే అందరి నినాదం అయ్యేలా వుందని అంటున్నారు. నిజానికి  యశ్వత్ సిన్హాకు గెలుపు మీద ఎప్పుడూ ఆశలు లేవు.. కానీ, ఓటమి ఏ స్థాయిలో ఉంటుంది అనేదే, ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.