జగన్ ది దృతరాష్ట్ర పాలన.. ఏపీలో దుశ్సాసన పర్వం
Publish Date:May 10, 2022
Advertisement
ఏపీలో మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు నిత్య కృత్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనలో ఏపీలో కీచకపర్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఆర్భాటంగా చెప్పుకున్న దిశ చట్టం, ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్, ఆడంబరంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయంటే ఉన్నాయనుకోవడానికే తప్ప మహిళల రక్షణ విషయంలో అవి చేస్తున్న పని శూన్యం. ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే.. కీచకులు, దుశ్సాసనులు వీరవిహారం చేస్తున్నారు. ఏపీలో మహిళలు భద్రతా, రక్షణా కరవై దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అరాచకత్వానికి చిరునామాగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దాని వెంట ఒకటిగా మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. పైపైచ్చు అత్యాచార ఘటనలపై నిరసనలు వ్యక్తం చేస్తే రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ మంత్రులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసే విషయంలో ఏ మాత్రం చొరవ చూపని పోలీసులు.. విపక్షాల ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంలో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక దాని వెంట ఒకటిగా మహిళలపై దారుణాలు జరుగుతుంటే... జగన్ మాత్రం దృతరాష్టుడిలా రాష్ట్ర పాలన సాగిస్తున్నారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిత అత్యాచార ఘటన మరువక ముందే, తెనాలి రైల్వే స్టేషన్ లో మరో సామూహిక అత్యాచార ఘటన. దాని వెంట మరొకటి..మరొకటి ఇలా ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై మ్లేచ కాముకుల దాడి జరుగుతూనే ఉంది. పలు సంఘటనల్లో మంత్రులు, పోలీసులు నిందితులను వెనకేసుకొస్తూ.. అత్యాచారాల నిరోధానికి బదులు నిందితుల రక్షణకే తమ ప్రాధాన్యత అని రుజువు చేసుకున్నారు. తెనాలి ఘటనలో సాక్షాత్తూ హోంమంత్రి నేరస్తులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడారు.
మహిళా హోంమంత్రి అయ్యుండీ.. దొంగతనం కోసం వచ్చిన వాళ్లు అనుకోకుండా తోపులాట జరిగి అత్యాచారం చేశారని చెప్పడం ప్రభుత్వానికి మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై చర్యలు తీసుకునే ఉద్దేశమే లేదా అన్న అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి. మరో సంఘటనలో హత్యాచారానికి గురైన మహిళది ఆత్మహత్య అని చెప్పడానికి సదరు ఎస్పీ పడిన తాపత్రేయం దిగ్భ్రమ కలిగించక మానదు. మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం నివేదిక రాకున్నా..అత్యాచారం జరగలేదనీ, ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందనీ మీడియాకు చెప్పడం.. నిందితులను కాపాడటానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తాయి.
మొత్తానికి ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలిగేలా పరిస్థితులు దిగజారిపోయాయి. ఏపీలో మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు నిత్య కృత్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనలో ఏపీలో కీచకపర్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఆర్భాటంగా చెప్పుకున్న దిశ చట్టం, ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్, ఆడంబరంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయంటే ఉన్నాయనుకోవడానికే తప్ప మహిళల రక్షణ విషయంలో అవి చేస్తున్న పని శూన్యం. ప్రభుత్వం ఉందా అని అనుమానం కలిగేలా జగన్ సర్కార్ తీరు ఉంది. తాజాగా పుట్టపర్తి జిల్లాలో పచ్చి బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత హత్య చేశారు. ఇలా వరుస సంఘటనలతో ఏపీ రేపుల రాష్ట్రంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చకుంది. దేశంలోనే మహిళలకు రక్షణ లేని రాష్ట్రంగా నిలిచింది.
http://www.teluguone.com/news/content/no-security-for-women-ia-ap-25-135693.html





