జేఈఈ మెయిన్స్ కే దిక్కులేదు.. ఈవీఎంలు భద్రమేనా?

Publish Date:Oct 6, 2022

Advertisement

గడపగడపకూ లో గడపగడపనా వ్యతిరేకత కనిపిస్తోంది. విమర్శలు, వ్యతిరేకతా తప్ప ఎక్కడా ఆదరణ కనిపించిన దాఖలాలు లేవు. అయితే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ, ప్రతి సభలోనూ రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ విజయం తథ్యం అంటున్నారు. గెలిచి తరాలి, గెలిచి తీరుతాం అంటున్నారు.

ఆయన మాటలను ఆయన తప్ప ఎవరూ నమ్ముతున్నట్లు కూడా కనిపించడం లేదు. చివరికి సొంత పార్టీలోనే 175కు 175 స్థానాల్లో విజయం అన్న జగన్ మాటలపై సెటైర్లు పేలుతున్నాయి. విపక్షాలైతే ముందు పులివెందులలో విజయాన్ని ఖాయం చేసుకోండి.. మిగిలిన నియోజకవర్గాల సంగతి తరువాత అంటున్నాయి. ఇక జగన్ స్వయంగా చేయించుకున్న సర్వేలు సమా అన్నిటిలోనూ కూడా వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నదనే తేల్చాయి. ఈ విషయాన్ని జగన్ స్వయంగా గడపగడపకు వర్క్ షాపులో వెల్లడించి.. అందుకు కారణం సరిగా పని చేయని మంత్రులు, ఎమ్మెల్యేలేనని చెప్పారు. అంతే కాదు.. తాను చెప్పినట్లు పని చేస్తే సరే సరి.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వను అంటూ హెచ్చరించారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదని కూడా విస్పష్టంగా చెప్పేశారు.

కొత్త వాళ్లని నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పారు. గ్రాఫ్ పడిపోయింది ఎమ్మెల్యేలు, మంత్రులదే తప్ప తనది కాదని ఆ వర్క్ షాపులో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతటా వ్యతిరేకత వ్యక్తమౌతున్నా..  జగన్ లో అదే విశ్వాసం కనిపించడానికి కారణాలేమిటన్నది అర్ధం కావడం లేదు. తనదైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారా? అని నిన్న మొన్నటి వరకూ తన, పర అన్న బేధం లేకుండా జోకులు వేసుకున్నారు. సామాజిక మాధ్యమంలో అయితే జగన్ విశ్వాసంపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అయితే జేఈఈ మెయిన్స్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన తరువాత జగన్ విశ్వాసానికి కారణం ఏమిటన్నది బోధపడుతున్నదన్న భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ ఈవీఎంలపై అనుమానాలు, సందేహాలూ వ్యక్తమయ్యాయి. ఈవీఎంలను హ్యాక్ చేయడం సులభమన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. పలు రాజకీయ పార్టీలు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. కొందరైతే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చని సోదాహరణంగా చెప్పారు. సరే ఈసీ ఆ ఆరోపణలను ఖండించింది అది వేరే సంగతి. 

ఇప్పుడు దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో చీటింగ్ జరిగింది.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ చీటింగ్ వ్యవహారంలో ఒక రష్యాన్ హ్యాకర్ హస్తం ఉన్నట్లు తేల్చింది.  జేఈఈ మెయిన్స్ లో 820 మంది  చీటింగ్ చేయడానికి రష్యన్ హ్యాకర్ మిఖైల్ షార్జిన్ దోహదపడినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. అంతే కాదు.. ఆ హ్యాకర్ ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకుంది.  గత నెలలో జరిగిన జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ టెస్ట్ కు దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మది లక్షల మంది హాజరయ్యారు.

ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రిస్ట్రిక్టడ్డ్ కంప్యూటర్‌లలో మాత్రమే నిర్వహించినా  రష్యన్ హ్యాకర్  ఈ వ్యవస్థనూ హ్యాక్ చేసినట్లు సీబీఐ దర్యాప్తు నిగ్గు తేల్చింది. రష్యన్ హ్యాకర్ సహకారంతో ఓ 920 మంది విద్యార్థులు తమ సహచరులతో  రిమోట్ యాక్సెస్ చేసుకుని ఎంట్రన్స్ లో లబ్ధి పొందారు. అంటే రిమోట్ యాక్సెస్ ద్వారా ఈ విద్యార్థులు తమ పరీక్షను వేరే చోట కూర్చున్న వారి చేత రాయించారన్న మాట. అంటే పరీక్ష హాల్లో ఈ విద్యార్థుల కంప్యూటర్లను హ్యాక్ చేసిన రష్యన్ హ్యాకర్ ఆ యాక్సెస్ ను ఈ విద్యార్థుల తరఫున పరీక్ష రాయడానికి వేరే ఎక్కడో సిద్ధంగా ఉన్న వారికి ఇచ్చేశాడన్న మాట.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ 24 మందిని అరెస్టు చేశారు.   సోనిపాట్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్‌లో ఈ రిమోట్ యాక్సెస్ జరిగినట్టు విసీబీఐ చెబుతోంది.  కంట్రోల్ రిస్ట్రిక్టడ్ కంపూటర్లనే ఓ పాతికేళ్ల రష్యన్ ఐటీ నిపుణుడు హ్యాక్ చేసి.. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే జేఈఈ మెయిన్స్ ను అభాసుపాలు చేసేశాడు.

ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకే ససాక్ష్యంగా చెబుతోంది. అటువంటప్పుడు ఈవీఎంలు హ్యాకింగ్ కు గురికావన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థుల యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని హ్యాక్ చెయ్యగలిగినప్పుడు.. ఒక్కో నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదా? సాధ్యం కాదని ఎలా చెప్పగలుగుతారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య ఈవీఎంలే కావాలన్న పట్టుదల ఎందుకు? పలు దేశాలు ఈవీఎంలు భద్రమైనవి కావని నిర్ధారణకు వచ్చి బ్యాలెట్ వైపు మళ్లినప్పుడు, దేశంలో అలా ఎందుకు చేయరు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా, కేంద్ర ఎన్నికల సంఘం పైనా ఉందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.