నో సెకండ్ చాన్స్ టు వైసీపీ!?

Publish Date:Jul 29, 2023

Advertisement

వైనాట్ 175 అంటూ జగన్ వచ్చే ఎన్నికలలో రెండో సారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషణాత్మకంగా చెబుతున్నారు.  2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతి, వైఎస్సార్ సెంటిమెంట్ సహా అన్ని సానుకూల అంశాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు కూడా గంపగుత్తగా వైపీపీకే పడటంతో ఆ పార్టీ విజయం నల్లేరుమీద బండి నడకగా మారిందంటున్నాయి. అయితే ఈ సారి ఏపీలో రాజకీయ పరిస్థితులు గతానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. సంక్షేమ ఫలాలను అందుకుంటున్న లబ్ధిదారులలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పథకాలలో కోత, జగన్ బటన్ నొక్కినా ఖాతాలలో సొమ్ములు పడకపోవడం, మరో వైపు నిత్యావసర ధరలన్నీ కొండెక్కిన చందంగా పెరిగిపోవడంతో వారిలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో  వందల రూపాయలు లాగేస్తోందన్న ఆగ్రహం జగన్ సర్కార్ పై సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇక గత ఎన్నికల సమయానికి కనీసం జనానికి మొహం చూపడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ ఉంది.

దీంతో ఆ పార్టీ నేతలెవరూ బయటకు రాలేదనే చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రచారం కూడా తూతూ మంత్రంగానే చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో సంప్రదాయ కాంగ్రెస్ ఓటు అంతా గంపగుత్తగా వైసీపీకి పడింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకున్న దాఖలాలు ఇసుమంతైనా లేవు. గతంలోలా సంప్రదాయ కాంగ్రెస్ ఓటు వైసీపీవైపు మొగ్గు చూపే పరిస్థితులూ లేవు. ఆ ఓటు ఈ సారి తెలుగుదేశంకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టిపరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటున్న జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే ఆ మాటకు కట్టుబడి ఉన్నానని చెబుతుండటంతో గత ఎన్నికలలో జరిగిన విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు కూడా కనిపించడం లేదు. 

 ఇక అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ పగ్గాలు చేపట్టనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒక వేళ అదే జరిగితే వైసీపీ ఓటులోనే భారీగా చీలిక ఏర్పడటం ఖాయం. వైఎస్ తనయగా, ముఖ్యమంత్రి అయిన తరువాత అన్న నిరాదరణకు గురైన చెల్లెలిగా ఆమెపై వైసీపీ శ్రేణులలో సానుభూతి వెల్లువెత్తుతుందని అంటున్నారు. వైసీపీలో ఉన్న వైఎస్ అభిమానలే కాదు.. వైసీపీ శ్రేణులు కూడా షర్మిల వైపే మొగ్గు చూపుతాయని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో అంటకాగుతుండటం, కేంద్రం పదే పదే విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోకుండా దులిపేసుకుని మరీ ఆ పార్టీ కాళ్లా వేళ్లా పడుతుండటం, కోరకుండానే కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు ప్రకటించేస్తుండటంతో రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు ఇప్పటికే వైసీపీకి దూరమైందని చెబుతున్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా మైనారిటీల సంక్షేమానికి పాటుపడిందనీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది.  గత ఎన్నికలలో వైసీపీకి అండగా నిలబడిన  మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పుడు దూరం అయ్యారు.   దీంతో ఎలా చూసినా జగన్ కు ఏపీ జనం మరో చాన్స్ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.