జగనన్న ఇదేం మద్దతన్నా.. ధాన్యం కొనుగోళ్లపై రైతుల వెతలు

Publish Date:Apr 22, 2022

Advertisement

ఏపీలో జగన్ సర్కార్ మాటలకూ చేతలకూ పొంతన ఉండటం లేదు. రైతు పక్షపాతినని చెప్పుకుంటున్న జగన్  ఆచరణలో మాత్రం వారిపై శీత కన్నేశారు. మద్దతు ధర ఇచ్చి మరీ దాన్యం కొనుగోలు చేస్తానని ఆయన ఇచ్చిన హామీ ‘ఫ్యాన్’ గాలికి కొట్టుకుపోయింది.   తెగుళ్లు, అధిక వర్షాలు,   దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. అసలే దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న రైతుకు ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పడంతో  మరోవైపు మద్దతు ధర లభించే పరిస్థితి కానరావడం లేదు. వర్షం.. తెగుళ్లు..  ధాన్యం రైతును దారుణంగా  దెబ్బతీశాయి. ఆరుగాలం కష్టించి సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాక అన్నదాత అల్లాడుతున్నాడు. సాగు కష్టాలను అధిగమించి పండించిన ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు గిట్టుబాటు ధర  లేక మరింత కుదేలౌతున్నాడు.  ప్రభుత్వం పేరుకే మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలు విషయంలో మాత్రం చేతులెత్తేసింది.ఆర్‌బీకేల్లో నిబంధనలు పరిశీలిస్తే ధాన్యం విక్రయించుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. యంత్రాలతో నూర్పిళ్లు చేస్తున్నందున తేమ ఉంటుందన్నారు. అయితే 17 శాతం లోపే తేమ ఉండాలని మార్కెటంగ్‌ శాఖ షరతులు విధిస్తున్నది. దీనికి తోడు ట్రాన్స్‌ఫోర్టు ఖర్చులు, కాటా కూలి కలిపితే బస్తాకు వందకుపైగా ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఆర్‌బీకేలలో షరతులు సడలించాలని, తేమను పరిగణనలోకి తీసుకోకుండా కోనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కూడా మద్దతు ధర అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని చెప్పిన జగన్ సర్కార్ ఇప్పుడు వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.    మార్కెట్‌లో ధాన్యం ధర  నానాటికీ తీసికట్టు అన్నట్లుగా పతనమౌతోంది. మరో వైపు జగన్ సర్కార్ రైతుల కష్టాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నది. దిగుబడులు తగ్గి, ధర పనతమై  రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కోనుగోలు చేస్తామని ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేసి చేతులుదులిపేసుకుంది.    క్షేత్రస్థాయిలో కొనుగోలుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.  ఇప్పటికీ  కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు పైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుని వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేసి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఒక్క సాగర్‌ ఆయకట్టులోనే  రెండున్నర లక్షలకు పైగా ఎకరాలలో వరి సాగు జరిగింది.  ఎకరాకు 25 బస్తాలలోపే దిగుబడులు ఉంటున్నాయని రైతులు తెలిపారు.  ప్రభుత్వం ఆర్కేబీలలో ధాన్యం కొనుగోళ్ల నిబంధనలు సడలించి మద్దతు ధరకుప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలన్న రైతుల డిమాండ్ ను సర్కార్ పెడచెవిన పెడుతోంది. ప్రకటనలకే రైతు భరోసా కానీ వాస్తవంలో జరుగుతున్నది రైతును దోపిడీ చేయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.