జగన్ ప్రభుత్వానికి జాలిలేదు.. ఏపీ హైకోర్టు

Publish Date:Apr 27, 2023

Advertisement

హక్కుల రక్షణకు నడుం బిగించిన ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ ను ఆ రాష్ట్రప్రభుత్వమే తప్పుపడుతోంది. హై కోర్టు జడ్జి సారథ్యం వహించే హెచ్ఆర్సీ తీర్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఓ బాలిక మరణింపై వాదించిన ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. కుప్పం మునిసిపాలిటీపరిధిలో అంగన్ వాడీ ఆయా ఇచ్చిన ఆహారం తిని ప్రాణాలు కోల్పోయిన దీక్షిత అనే పాప కేసులో ప్రభుత్వం ప్రదర్శించిన అమానవీయతపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. 

2022 ఫిబ్రవరిలోలో కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఓ పాఠశాలలో దీక్షిత అనే పాప ప్రాణాలు వదిలింది. అంగన్ వాడీ ఆయా పెట్టిన కోడుగుడ్డు తినడంతో దీక్షిత చనిపోయిందని ప్రాథమికంగా తేలింది. అప్పుడు మిగిలిన కోడిగుడ్లను పరిశీలించగా, అవి కుళ్లిపోయినవిగా నిర్ధారణ అయ్యింది. దీనితో దీక్షిత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. ఈ సంఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు విచారణ చేపట్టింది.  దాదాపు పది నెలల పాటు సాగిన విచారణలో ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ను దోషులుగా  తేలుస్తూ హెచ్ఆర్సీ తీర్పు ఇచ్చింది. దీక్షిత కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడమే కాక, బాధ్యులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీ ఆదేశించింది.

అయితే హెచ్ఆర్సీ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ న్యాయ సలహాదారుల సలహా మేరకు ప్రభుత్వం హెచ్చార్సీ తీర్పును సువాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు హెచ్చార్సీ తీర్పుపై ప్రభుత్వం ఎందుకు అప్పీలు చేయాల్సి వచ్చిందంటూ నిలదీసింది. అసలు ఇలాంటి కేసుపై అప్పీలు చేయడానికి మీకు మనసెలా ఒప్పిందిఅంటూ ప్రభుత్వ అడ్వొకేట్లను హైకోర్టు ప్రశ్నించింది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ జయసూర్యలతో కూడిన బెంచ్ కుప్పం సంఘటన ప్రభుత్వ తప్పిదంగానే పరిగణించింది. పసి పాప ప్రాణాలు పోతే, ఆ వావుకు ప్రభుత్వం చే నియమించిన వారే కారణమైతే కేవలం ఎనిమిది లక్షల రూపాయల  నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం వెనక్కు తగ్గడాన్ని హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల వాదులు స్వాగతిస్తున్నారు. 


 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.