బీజేపీ-సంఘ్ పరివార్ మధ్య అగాధం.. మోహన్ భగవత్ శాంతి మంత్రం సంకేతమదేనా?

Publish Date:Dec 22, 2024

Advertisement

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా సంఘ్ పరివార్, బీజేపీ మధ్య అగాధం ఇంకా పూడలేదన్న సంకేతాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. తాజాగా మోహన్ భగవత్ మసీదు, మందిరం వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రవచించడం  బీజేపీ,సంఘ్ పరివార్ మధ్య సంబంధాలు ఇంకా బలపడలేదనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ముందు సంఘ్ పరివార్, బీజేపీ అగ్రనాయకత్వం మధ్య అగాధం ఉదన్న విషయం ప్రస్ఫుటమైంది. బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అప్పట్లో పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు వారి మధ్య సామరస్యం లేదని విస్పష్టంగా తేల్చేశాయి. ఇక తాజాగా   మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా సంఘ్ పరివార్, బీజేపీ నేతలు పరస్పర అవగాహనతో, సామరస్యంగా కలిసి పని చేశారన్న భావన కలిగింది.  అయితే అదేమీ వాస్తవం కాదని అకస్మాత్తుగా భగవత్ చేసిన మసీదు, మందిరం వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ చేసిన శాంతి ప్రకటన బీజేపీ అగ్రనాయకత్వం విధానాల పట్ల సంఘ్ పరివార్ అసంతృప్తితో ఉందన్న భావన కలిగించేలా ఉంది. 

బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మైనార్టీలపై తమ వ్యాఖ్యల ద్వారా విషం చిమ్ముతున్నారని, ఫలితంగా దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారనీ మోహన్ భగవత్  తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. భారత దేశమంటేనే పరమతసహనం. అదే కొనసాగాలి. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. అన్ని మతాల వారు ఎన్నో వందల సంవత్సరాలుగా కలసి మెలసి బతుకుతున్నారు. మసీదు, మందిరం వివాదాలు ఇకపై కొనసాగనివ్వరాదు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ ఆరంభమైంది. శ్రీరాముడు హిందువుల ఆరాధ్యుడు. రామమందిర నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కనుక మందిర నిర్మాణం వారి నమ్మడానికి ప్రతీక అన్నారు. అలాగని ప్రతిచోటా కొత్త వివాదాలు రెకెత్తించడం సబబుకాదని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు.

ప్రతి మతానికి నమ్మకాలు,  దైవం.సంస్కృతి ఉంటాయని వాటిని గౌరవించి తీరాల్సిందేననీ మోహన్ భగవత్ చెప్పారు.  దేశంలోని ప్రతిపౌరునికీ తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించే హక్కు ఉందన్నారు.  మహారాష్ట్ర లోని విశ్వగురు భారత్, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ మసీదు, రాజస్తాన్ లోని అజ్మేర్ షరీఫ్ దర్గా ల వివాదాలు ప్రస్తావించి వాటి వివాదంలోకి లాగడాన్ని  తప్పుపట్టారు. ఇకపై కొత్త వివాదాలకు అవకాశాలు ఇవ్వరాదని బీజేపీకి హితవు చెప్పారు.  దేశంలో అందరూ కలసిమెలసి జీవిస్తున్నారని,అలాగే శాంతియుతంగా జీవించడమే అసలైన గుర్తింపు అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మెలగాలని సూచించారు. జరిగిన తప్పులు మరలా జరగకుండా తగిన జాగర్తలు తీసుకుని సర్దుకుపోవడం వల్ల ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర మతాల దైవాలను అవమానించడం మన సంస్కృతి కాదన్నారు. ఏ దేశంలో నైనా మెజార్టీలూ,మైనార్టీలు ఉంటారని,   వారి మధ్య విభేదాలు రాకూడదన్నారు.  ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రకటనలు,మధ్యవర్తిత్వం జరుగుతున్నా యుద్ధాలు ఆగడం లేదు.భారత్ లో మైనార్టీల అణచివేత జరుగుతోందన్న ప్రచారం ఉందనడం ద్వారా మోహన్ భగవత్ బీజేపీకి ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు.  ఇకపై మసీదు శిధిలాల్లో మందిరం  అనే వివాదాలను తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని సూచించారు.

సంఘ్ పరివార్, బీజేపీ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా సరిలేవని,అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మేజార్టీ రాలేదన్న వాదనకు బలం చేకూర్చేవిగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదిఏమైనా భగవత్  చెప్పిన విషయం అక్షర సత్యమనడంలో సందేహం లేదు. దేశంలో పరమత సహనంతో అందరూ కలసిమెలసి బ్రతకాలన్న ఆయన సూచన శిరోధార్యం.  హిందూత్వ అతివాదులు ఆయన వ్యాఖ్యలను ఔదాల్చి వివాదాలకు స్వస్థి పలికితే భారత్   ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.