శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ.. ఏపీ బీహార్ ను మించిపోయిందిగా!

Publish Date:May 1, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ నేరాల హబ్ గా మారిందా?.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా? ఒకప్పుడు బీహార్ లో ఉండే పరిస్థితులను మించి ఇప్పుడు ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి అవుననే సమాధానం వస్తుందని పరిశీలకులు అంటున్నారు.  మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఏపీలో రోజువారీగా జరిగే సాధారణ సంఘటనల్లా మారిపోయాయి. నేరస్తులు యధేచ్ఛగా తిరుగుతున్నారు. దారుణాలన్నిటికీ వీడియో సాక్ష్యాలు బయటపడుతున్నా పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక్కో సారి అయితే.. ఎలాంటి దర్యాప్తూ జరపకుండానే నిందితులను వెనకేసుకొచ్చేలా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. దీంతో పోలీసులు నిందితులను వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోరా? అంటూ జనాగ్రహం వెల్లువెత్తుతున్నా పోలీసులలో కదలిక ఉండటం లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రోజూ ఏదో ఒక అత్యాచారం, హత్య, దాడుల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఏపీలో నేరస్తులకు తామేం చేసిన ఏమీ కాదు, శిక్షలు ఉండవు అన్న భరోసా ఏర్పడినట్లుగా భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అరాచకం పరాకాష్టకు చేరితేనే పరిస్థితి ఇలా తయారౌతుందని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో బీహార్ లో ఇటువంటి పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు బీహార్ ను తలదన్నేలా క్షీణించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒకదాని తరువాత ఒకటిగా మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, దాడులు, హత్యల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో ఓ యువతిని హత్య చేసి పెట్రోల్ పోలి కాల్చేశారు. రేపల్లె రైల్వే స్టేసన్ లో వలస కూలీపై సామూహిక అత్యాచారం..ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు నాలుగైదు సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోనికి వస్తున్నాయి. ఏ సంఘటనలోనూ నిందితులను అరెస్టు చేసిన దాఖలాలు కానీ, దిశ చట్టం కింద కేసులు నమోదు చేసిన దాఖలాలు కానీ లేవు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజులలో విచారించి శిక్షిస్తామంటూ సీఎం జగన్ ఘనంగా చేసిన ప్రకటన గాలి మూటగానే మిగిలిపోయింది.
 అసలు మహిళలపై అత్యా చారాల సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం సంగతి అటుంచి పోలీసులు వారికి వత్తాసుగా నిలబడుతున్నారా అన్నట్లుగా పరిస్థితి ఉందనీ, అందుకే నేరస్తుల్లో తమకు ఏం కాదు, కేసులు, శిక్షలు ఉండవన్న బరోసా పెరిగిపోయిందనీ పరిశీలకులు చెబుతున్నారు. వివాహితపై హత్యాచారం ఘటనలో పోస్టుమార్టం జరగకముందే అత్యాచారం జరగలేదంటూ ఎస్పీ ప్రకటన, అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగిందంటూ అదేం పెద్ద నేరం కాదన్నట్లుగా ఇచ్చిన వివరణను ఇందుకు వారు ఉదాహరణగా చూపుతున్నారు.  వ్యవస్థ నిలబడుతుంది. గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రోజుకో రేప్ జరుగుతున్నా పోలీసులలో కదలిక కనిపించడం లేదు. బాధితుల పక్షాన తెలుగుదేశం, ఇతర విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భద్రత లేని రాష్ట్రంలో ఉండలేక మహిళలందరూ వేరే రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితులు వస్తాయని విపక్ష నాయకుడు నారా లోకేష్ అన్నారు.  ఏది ఏమైనా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించకుంటే.. ప్రజలే తిరగబడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే పరిస్థితి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.