ఆంధ్రప్రదేశ్ నేరాల హబ్ గా మారిందా?.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా? ఒకప్పుడు బీహార్ లో ఉండే పరిస్థితులను మించి ఇప్పుడు ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి అవుననే సమాధానం వస్తుందని పరిశీలకులు అంటున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఏపీలో రోజువారీగా జరిగే సాధారణ సంఘటనల్లా మారిపోయాయి. నేరస్తులు యధేచ్ఛగా తిరుగుతున్నారు. దారుణాలన్నిటికీ వీడియో సాక్ష్యాలు బయటపడుతున్నా పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక్కో సారి అయితే.. ఎలాంటి దర్యాప్తూ జరపకుండానే నిందితులను వెనకేసుకొచ్చేలా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. దీంతో పోలీసులు నిందితులను వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోరా? అంటూ జనాగ్రహం వెల్లువెత్తుతున్నా పోలీసులలో కదలిక ఉండటం లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రోజూ ఏదో ఒక అత్యాచారం, హత్య, దాడుల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఏపీలో నేరస్తులకు తామేం చేసిన ఏమీ కాదు, శిక్షలు ఉండవు అన్న భరోసా ఏర్పడినట్లుగా భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అరాచకం పరాకాష్టకు చేరితేనే పరిస్థితి ఇలా తయారౌతుందని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో బీహార్ లో ఇటువంటి పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు బీహార్ ను తలదన్నేలా క్షీణించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకదాని తరువాత ఒకటిగా మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, దాడులు, హత్యల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో ఓ యువతిని హత్య చేసి పెట్రోల్ పోలి కాల్చేశారు. రేపల్లె రైల్వే స్టేసన్ లో వలస కూలీపై సామూహిక అత్యాచారం..ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు నాలుగైదు సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోనికి వస్తున్నాయి. ఏ సంఘటనలోనూ నిందితులను అరెస్టు చేసిన దాఖలాలు కానీ, దిశ చట్టం కింద కేసులు నమోదు చేసిన దాఖలాలు కానీ లేవు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజులలో విచారించి శిక్షిస్తామంటూ సీఎం జగన్ ఘనంగా చేసిన ప్రకటన గాలి మూటగానే మిగిలిపోయింది.
అసలు మహిళలపై అత్యా చారాల సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం సంగతి అటుంచి పోలీసులు వారికి వత్తాసుగా నిలబడుతున్నారా అన్నట్లుగా పరిస్థితి ఉందనీ, అందుకే నేరస్తుల్లో తమకు ఏం కాదు, కేసులు, శిక్షలు ఉండవన్న బరోసా పెరిగిపోయిందనీ పరిశీలకులు చెబుతున్నారు. వివాహితపై హత్యాచారం ఘటనలో పోస్టుమార్టం జరగకముందే అత్యాచారం జరగలేదంటూ ఎస్పీ ప్రకటన, అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగిందంటూ అదేం పెద్ద నేరం కాదన్నట్లుగా ఇచ్చిన వివరణను ఇందుకు వారు ఉదాహరణగా చూపుతున్నారు. వ్యవస్థ నిలబడుతుంది. గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రోజుకో రేప్ జరుగుతున్నా పోలీసులలో కదలిక కనిపించడం లేదు. బాధితుల పక్షాన తెలుగుదేశం, ఇతర విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భద్రత లేని రాష్ట్రంలో ఉండలేక మహిళలందరూ వేరే రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితులు వస్తాయని విపక్ష నాయకుడు నారా లోకేష్ అన్నారు. ఏది ఏమైనా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించకుంటే.. ప్రజలే తిరగబడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే పరిస్థితి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-existence-of-law-and-order-39-135310.html
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.