Publish Date:Jul 14, 2022
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ బండారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం బట్టబయలు చేసేసింది. వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు.. వైసీపీ కార్యకర్తలేనని చెప్పకనే చెప్పేసింది. అదెలాగంటే.. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రయ ప్రారంభం కానున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి జోక్యం ఉండరాదన్న ఉద్దేశంతోనే ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం విపరీతంగా ఉంటోందనీ, ఓటర్ల జాబితాలో వారు చేతి వాటం చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేసిందే ఎన్నికలలో లబ్ధికోసమన్న విమర్శలు చాలా కాలం నుంచీ వస్తున్న సంగతి విదితమే. అందుకు తగ్గట్టుగానే లబ్ధిదారులకు పథకాల లబ్ధి అందే విషయం దగ్గర నుంచీ.. ప్రతి పనీ వారి కనుసన్నలలోనే జరిగేలా జగన్ స్కెచ్ వేశారనీ, అందుకే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేశారనీ అంటున్నారు. చివరకు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉందని చెబుతున్నారు.
‘గడపగడపకూ’ కార్యక్రమంలో కూడా లబ్ధిదారుల వివరాల జాబితాను ఎమ్మెల్యేలు వలంటీర్ల వద్దనుంచే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలుగుదేశం పట్ల మొగ్గు చూపుతున్నారనుకున్న వారికి పథకాలు అందకుండా చేయడం దగ్గర నుంచీ వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వరకూ నానా రకాల అరాచకాలకూ జగన్ సర్కార్ వాలంటీర్లను వాడుకుంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన గతంలో ఉపఎన్నికల సమయంలోనూ వాలంటీర్ల జోక్యం పెచ్చరిల్లిందన్న విమర్శలూ ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-election-duties-to-volunteers-ec-orderd-jagan-sarkar-25-139763.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.