Publish Date:Mar 20, 2024
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఏపీలో మాత్రం ఆ సామెతను సీఎం జగన్ తలచుకుంటే తప్పులకు కొదవా అని మార్చుకోవాలి. జగన్ పై ప్రేమతో అధికారులు తప్పులు చేయడానికి వెరవని విచత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఔను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది అంటే ఉంది. అంతే అది అమలు కాదు. ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతాయి. ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరు. కోడ్ అమలుకు ఉపక్రమించరు. అది అంతే. ఎందుకలా అంటే అంతా జగన్మాయ అంటారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా చాటారు. కోడ్ ఉల్లంఘన 60 అడుగుల కటౌట్ రూపంలో దర్శన మిస్తోందంటూ సెల్ఫీ దిగి మరీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రీ వెళ్లే ప్రధాన రహదారిపై ఎపీ సీఎం జగన్ 60అడుగుల కటౌట్ దర్జాగా దర్శనమిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజుల తరువాత కూడా అత్యంత ప్రధానమైన రహదారిలో అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షించేలా ఏర్పాటు చేసిన కటౌట్ తొలగించలేదంటే ఏపీలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలౌతోందన్నది అర్ధమౌతుంది. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు.
అధికారులు పని చేయడం లేదా అంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. అదే జొన్నాడ వద్ద వచ్చీ పోయే వాహనాలన్నిటినీ ఎండను కూడా లెక్క చేయకుండా క్షుణ్ణంగా తనఖీలు చేసి పంపిస్తున్నారు. చిన్న చిన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు గోడల మీద రాతలను తొలగించేస్తున్నారు. తుడిచేస్తున్నారు. అయితే ఘనత వహించిన అధికారులకు అంత ఘనంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి కటౌట్ మాత్రం ఆనలేదు. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికార మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక సీఎం సహా రాజకీయ నాయకుల ఫొటోలేవీ కనపడకూడదనీ, అలాగే వాలంటీర్లు ఎవరూ విధుల్లో పాల్గొనకూడదనీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలా ఇచ్చేసి ఊరుకోలేదు. ఎక్కడైన నేతల ఫొటోలు కనిపించినా, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నా వెంటనే ఫొటోలు తీసి పంపించమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా, అందుకు సంబంధించిన ఆధారాలు సమాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దారి ఎన్నికల కోడ్ దే ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదేగా ఉందనడానికి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ కార్యదర్శి, రాష్ట ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సీఎం 60 అడుగుల కటౌట్ ముందు ముందు నిలబడి దిగిన సెల్ఫీయే నిదర్శనం. అయినా మన పిచ్చి కానీ రాష్ట్రంలో పౌరపంపిణీ వాహనాలపైనా , ఈసేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలపైనా షిక్కటి షిరునవ్వుతో ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు ఎక్కడో రోడ్డుపై ఉన్న 60 అడుగుల కటౌట్ ను ఎందుకు పట్టించుకుంటారు. ఎన్నికల కోడ్ కు ఏపీ సీఎం జగన్ అతీతులని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారా అన్న అనుమాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల సంఘం కళ్లు తెరిచి ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-election-code-in-ap-39-172422.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.