Publish Date:Mar 19, 2024
ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీడియా సమావేశం ఏర్పాటు కేసి మరీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ ప్రకటనతో దేశం అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల కోడ్ అమలు అవుతున్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైసీపీ ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ దాడులకు గురైన బాధితులు ఫిర్యాదులు చేస్తే.. పోలీసలు మాత్రం బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. ఇక ఫ్లెక్సీల తొలగింపు విషయానికి వస్తే.. పోలీసువారి పహారాతో అధికారులు సెలక్టివ్ గా తెలుగుదేశం, జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. వైసీపీకి చెందిన ఫ్లెక్సీల జోలికి వెళ్లడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నా.. ఎన్నికల సంఘం కళ్లకు మాత్రం కనిపించడం లేదు.
అన్నిటికీ మించి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాల కంటే జగన్ మోహన్ రెడ్డి సేవలో తరించడమే ముఖ్యమన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర సచివాలయ అధికారులు జగన్ సేవ కోసం ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుందన్న బెదురు వారిలో కనిపించడం లేదు. ఎన్నికల సంఘం పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ రాదన్న ధీమాయో ఏమో.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్, ఆయన కేబినెట్ మంత్రుల ఫొటోలను ఇంకా తొలగించలేదు. అలాగే వైసీపీ నవరత్నాల పథకాల లోగో, సంక్షేమ పథకాల వివరాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలను తొలగించాలి. అలా తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అవేమీ జరగడం లేదు.
అంతే కాదు.. చివరికి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంపిణీ చేసే ప్యాడ్ లతో కూడా వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే కోడ్ ను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆర్డీవో ఆ ప్యాడ్ లను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసి కూడా ఎమ్మెల్యే అనుచరుల బెదరింపులకు తలొగ్గి వాటిని ఉపంసంహరించుకున్నారని తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. ఏపీకి ఎన్నికల కోడ్ వర్తించదా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-election-code-25-172348.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.