సైకిల్ సారథి లోకేషే.. ఎనీ డౌట్?

Publish Date:Jan 29, 2025

Advertisement

దివంగ‌త ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు దిగ్విజ‌యంగా ముందుకు న‌డిపించుకుంటూ వ‌చ్చారు. అధికారం కోల్పోయిన ప్ర‌తిసారి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్తేజాన్నినింపుతూ.. ప‌డిలేచిన కెర‌టంలా రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వ‌స్తూ టీడీపీని బ‌ల‌మైన పార్టీగా నిలుపుతూ వ‌చ్చారు. ఇటీవ‌లి కాలంలో చంద్ర‌బాబు వ్యూహాల‌కుతోడు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ వ్యూహాలుకూడా తోడుకావ‌టంతో పార్టీ మ‌రింత బ‌లోపేతం అయింది.  అయితే లోకేష్ ఈ స్థాయికి ఎదగడం అంత ఆషామాషీగా జరగలేదు. తండ్రి చాటు తనయుడిగా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే ఆ నడకను ఆపేయడానికి ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. కుయుక్తులు పన్నారు. ఆయన ఆహార్యాన్నీ, ఆహారాన్ని, మేనరిజాలను ఇలా వేటినీ వదలకుండా విమర్శలు గుప్పించారు. చివరాఖరికి బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడలేదు. అయితే ఉలి దెబ్బలకు శిల శిల్పంగా మారినట్లుగా ఆయన ఆ విమర్శల దాడిని తట్టుకుని ప్రజా నాయకుడిగా ఎదిగారు.  

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం సైనికుడు నారా లోకేష్.   నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అలా అంచలంచెలుగా ఎదిగిన నారా లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  టీడీపీకి భ‌విష్య‌త్ నాయ‌కుడిగా మారారు. ప్ర‌స్తుతం పార్టీని త‌న క‌నుస‌న్న‌ల్లో న‌డుపుతూ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. రాజ‌కీయంగా .. పాల‌నాప‌రంగా అన్ని అంశాల‌పై మంచి ప‌ట్టును సంపాదించిన లోకేశ్.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, అన్ని అంశాల్లో త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకుంటున్న‌ లోకేశ్‌.. ఇసుమంతైనా  గ‌ర్వం లేకుండా  ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో  తెలిసిన నేతగా త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను, పరిణితిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

ప్ర‌భుత్వంలో పాల‌నాప‌రంగానూ చంద్ర‌బాబుకు త‌గ్గ త‌న‌యుడుగా లోకేశ్ అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొందుతున్నారు. మంత్రిగా కొన‌సాగుతూ కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో కీల‌కంగా మారిన లోకేశ్ ను డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆశ‌ప‌డుతున్నారు. దీంతో లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాలంటూ వారు ఇటీవ‌ల పెద్ద ఎత్తున గళమెత్తారు.   ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్న స‌భా వేదిక‌పైనే నేతలు లోకేశ్ కు డిప్యూటీ సీఎం విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, ఈ విష‌యం కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అల‌ర్ట్ అయింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దంటూ నేత‌ల‌కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆ విషయంపై మాట్లాడటం మానేశారు.  అదే సమయంలో ఈ విష‌యంపై లోకేశ్ స్పందించిన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఆనందడోలికల్లో ముంచేసింది. వాస్త‌వానికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి లోకేశ్ కు అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయి.. కానీ, కూట‌మిలో విబేధాలు రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం విష‌యంలో లోకేశ్ వెన‌క్కు త‌గ్గారు. మీడియాతో మాట్లాడుతూ ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వి కంటే తాను తెలుగుదేశం కార్య‌క‌ర్త‌గా ఉండ‌టానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తానంటూ టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంలో లోకేశ్ పాత్ర కీల‌క‌మ‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మిని ముందుండి న‌డిపించిన‌ప్ప‌టికీ.. లోకేశ్ చేప‌ట్టిన‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ హ‌యాంలో నాలుగేళ్లు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, ప్ర‌జలు ప్ర‌భుత్వంకు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు వెన‌క‌డుగు వేశారు.  అలాంటి స‌మ‌యంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో లోకేశ్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొండి ప‌ట్టుద‌ల‌తో లోకేశ్ పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ప్ర‌జ‌లు సైతం లోకేశ్ కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు రోడ్డు పొడ‌వునా బారులు తీరారు. దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెచ్చుకుంది. యువగళం పాదయాత్రే జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం పడేలా చేసింది. ఆ త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మిని ముందుండి న‌డిపించ‌డంలో విజ‌య‌వంతం కావ‌డంతో కూట‌మి ప్ర‌భుత్వం అద్భుత విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చింది.

లోకేశ్ ను అభిమానించే వారిలో టీడీపీ శ్రేణుల‌తోపాటు ఏపీలో ల‌క్ష‌లాది మంది   ఉన్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు, యువ‌కులు క‌ర‌చాల‌నం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డుతున్నారు. త‌క్కువ కాలంలోనే ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా లోకేశ్ ఎదిగారు. చంద్ర‌బాబు నాయుడు కొడుకుగానే కాకుండా.. త‌న సొంత స‌మ‌ర్ధ‌త‌తో రాజ‌కీయాల్లో లోకేశ్ రాణిస్తున్నారు. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్టేందుకు అవ‌కాశం రాక‌పోయినా రాబోయే కాలంలో లోకేశ్‌కు ముఖ్య‌మంత్రి అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.