బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం
Publish Date:Aug 29, 2025
Advertisement
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం (ఆగస్టు 29) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాల్సి ఉంటుంది. భక్తులు మాత్రమే కాకుండా ఆలయ ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆలయ ఉద్యోగులు కొలువులకు సంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ ల వినియోగంపై నిషేధం అమలులోనికి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఎవరూ కూడా సెల్ ఫోన్ లు వినియోగించకూడదు. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలని దుర్గగుడి ఈవో తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-cellphones-in-vijayawada-kanakadurga-temple-36-205196.html
http://www.teluguone.com/news/content/no-cellphones-in-vijayawada-kanakadurga-temple-36-205196.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026





