Publish Date:Jul 24, 2022
అరి చేతిలో వైకుంఠం చూపించేసి చివరకు అరిటాకులో చద్దన్నం పెట్టారన్నది ఓ నానుడు. జగన్ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసి.. ఇప్పుడు వాటి అమలు చేయలేక కోతలు, వడ్డింపులు, బాదుడు అంటూ జనం నెత్తిన బండ పడేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు స్వర్గం అని తేలిపోయింది.
ఆయా సచివాలయాల ఉద్యోగులకు వేతనాలకు బడ్జెట్ లేదని స్వయంగా ప్రభుత్వమే చెప్పకుండానే చెప్పేసింది. అంటే ఏన్నో వడపోతల తరువాత, ఆందోళనల తరువాత ప్రబేషన్ పొందినా వారికి పెరిగిన వేతనాలు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రొబేషన్ కోసమే రోడ్డెక్కిన సచివాలయాల ఉద్యోగులు పూర్తిగా విజయం సాధించలేదు. దాదాపు 60 వేల మందికి ప్రభుత్వం ప్రొబేషన్ ఇవ్వలేదు. పోనీ ఇచ్చిన వారికైనా పెరిగిన వేతనాలు ఇస్తుందా అంటే అదీ లేదని ఇప్పుడు చెబుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యగోలు విషయంలో ప్రతి సారీ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కేవలం 15 వేల రూపాయల వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు.
ప్రొబేషన్ విషయంలోనూ వారు నానా ఇబ్బందులూ పడ్డారు. పరీక్ష రాసి అందులో అర్హత సంపాదించి ఉద్యోగం సాధించుకున్న వారిని ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష అన్నారు. తొలుత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ప్రొబేషన్ కు మళ్లీ ఎటువంటి పరీక్షలూ అవసరం లేదనీ, ఆటో మేటిగ్గా వచ్చేస్తుందని ప్రకటించిన జగన్.. రెండున్నరేళ్ల తరువాత పరీక్ష రాసి అర్హత సాధించుకోవాలన్నారు. అలా కొత్త నిబంధనతో దాదాపు 60 వేల మందిని ప్రొబేషన్ కు అనర్హులుగా ప్రకటించారు. పోనీ అర్హులంటూ ప్రొబేషన్ ఇచ్చిన వారికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెరిగిన వేతనాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అందుకు బడ్జెట్ లేదట.
ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించడానికి నిబంధనలు అంగీకరించవట. ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని ఎదురు చూస్తున్న సచివాలయాల ఉద్యోగులకు ట్రెజరీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. ఆ కారణంగా ఈ నెల కూడా గతంలోలా 15 వేల రూపాయల వేతనం మాత్రమే వస్తుందని ట్రెజరీ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు సమాచారం అందించాయి.ముందు మందు నిబంధనలన్నీ పూర్తి చేసి అరియర్స్ తో సహా వేతనాలిస్తామని ప్రభుత్వ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-budget-for-grama-ward-secrateriat-employees-25-140449.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.