కవితపై ఆరోపణలు వద్దు.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Publish Date:Aug 24, 2022
Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై ఎటువంటి ఆరోపణలూ చేయవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తెలంగాణ సీఎం కేటీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కవిత పాత్రపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి సిటీ సివిల్ కోర్టు బుధవారం (ఆగస్టు 24) మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇక ముందు ఆరోపణలు చేయరాదని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ కూడా ఈ వ్యవహారంలో కవితపై వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కవితకు పాత్ర ఉందంటూ బీజేపీకి చెందిన ఢిల్లీ ఎంపీ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు... ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/no-alligation-on-kavita-in-delhi-liquor-scam-city-civil-court-interium-order-25-142585.html





