ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతు?!

Publish Date:May 8, 2025

Advertisement

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కి పెద్ద చరిత్రే ఉందని చెప్పక తప్పదు. వైసీపీ ఏర్పాటు నుంచి జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో  చక్రం తిప్పే పరిస్థితి ఉండేది.  కాని ఇప్పుడు  ఆ పరిస్థితి ఇసుమంతైనా ఎక్కడా కానరావడం లేదు.   కేవలం ఒక్కరు, ఇద్దరు మినహా  అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి, చక్రం తిప్పిన నేతలెవరూ ఇప్పుడు ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేదు. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో తిరుపతి, కుప్పం మినహా అన్నింటిలో వైసీపీ బలం స్పష్టంగా కనిపించేది.  2019 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది.  వైసీపీ అధినేత జగన్   ప్రభావం ఆ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపిందించి. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనతో ఆ పార్టీని జిల్లా జనం పూర్తిగా తిరస్కరించారు. అందుకే 2024 ఎన్నికలలో వైసీపీ  పరిస్థితి తలకిందులై పోయింది.  ఎ  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం విజయబావుటా ఎగుర వేసింది.   చంద్రగిరి, పూతల పట్టు నియోజకవర్గాలలో  చాల సంవత్సరాల తరవైక టీడీపీ జెండా ఎగురేసింది. 

ఇక కూటమి ప్రభుత్వం  ఏర్పడిన తరువాత  జిల్లాలో వైసీనీ నేతల అడ్రస్ ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది.  అధికారం ఉందని ఇష్టారాజ్యంగా  ఇసుక  దందా నుంచి భూముల కబ్జాల వరకూ చెలరేగిపోయిన నేతలు ఇప్పుడు వారి నియోజకవర్గాలవైపు కూడా చడటం లేదు.  అది పక్కన పెడితే ఇంకా ఉన్నాం అని చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు నేతలు సైతం ఇంటి గడపదాటి ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. వీరిలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఒకరు. ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు జగన్.  దీంతో ఆ హోదాలో భూమన  తన ఇంటి నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప..  ఎక్కడా ప్రజలతో కలిసి లేదా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవని సొంత పార్టీ  శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. ఇక ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గ నాయకులతో అడపా దడపా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇదివరకటిలా యాక్టివ్ గా లేరు.  పెద్దిరెడ్డి కుటుంబం అయితే నియోజకవర్గంలోని తమ సొంత గ్రామానికి వెళ్లడానికి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి ఉంది. వీరు తప్ప ఇక జిల్లాలో ఎక్కడా మరో వైసీపీ నేత కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  

By
en-us Political News

  
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.