ఎవరికి వారే యమునా తీరేనా?: రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి

Publish Date:Jun 14, 2022

Advertisement

దేశంలో మోడీ సర్కార్ విద్వేష పూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందనీ, విచ్ఛిన్న రాజకీయాలు నెరపుతోందనీ బీజేపీయేతర పార్టీలన్నీ ఆరోపణలతో దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే విషయంలోనే ఆ పార్టీల యత్నాలు ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్లే విషయంలో చర్చలకు మమతా బెనర్జీ ఆహ్వానానికి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో బీజేపీకి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి టెన్షన్ లేని వాతావరణం నెలకొంది.

విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై విపక్షాలనే ఏకతాటిపైకి తీసుకురావడానికి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఈ విషయంపై చర్చకు రావాల్సిందిగా మమతా బెనర్జీ 22 మంది విపక్షాల నేతలకు ఆహ్వానం పంపిన సంగతి విదితమే. కేసీఆర్ సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసింది. కేసీఆర్ మాత్రం పూర్తిగా గైర్మాజర్ అనుకోకుండా తన బదులుగా, లేదా తన ప్రతినిథిగా కేకేను పంపిస్తున్నారు. ఏది ఏమైనా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రేపు హస్తిన వేదిక గా జరగనున్న విపక్ష నేతల భేటీ విపక్షాల అనైక్యతకు మరో ఉదాహరణగా మిగిలిపోనున్నదని పరిశీలకులు అంటున్నారు.

ఎందుకంటే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉండనున్నారు. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈడీ విచారణ, అందుకు కాంగ్రెస్ నిరసనలతో కాంగ్రెస్ తరఫు నుంచి ఈ సమావేశానికి ఎవరైనా హాజరౌతారా అన్నది అనుమానమే. ఇక కేసీఆర్ హాజరు కాబోవడం లేదని తేలిపోయింది. మహాముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల హాజరుపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు.

అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ల హాజరుపై కూడా ఎటువంటి సమాచారం లేదు.  మమతా బెనర్జీ నిర్వ‌హిస్తున్న ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పలు వామపక్ష నేతలు కూడా భావిస్తున్నారు. ఇలా ఉండగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలను విడిగా చేస్తున్నదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వివిధ పార్టీల నేతలతో చర్చించేందుకు ఇప్పటికే సోనియా గాంధీ మల్లిఖార్జున్ ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టే మమతా బెనర్జీ కూడా తాను నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపలేదు.  ఇక పోతే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 18న ఎన్నిక జ‌రుగుతుంది.

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.