గుండె జారి గల్లంతయితే సస్పెండేనట
Publish Date:Jul 18, 2013
Advertisement
“ఆమె ఓరకంట చూస్తూ ఒక చిరునవ్వు నవ్వితే ఎవరి గుండెయినా జారి గల్లంతవాల్సిందే. మరి అటువంటప్పుడు ఆ పైలట్లు మాత్రం గుండె నిబ్బరం చేసుకొని విమానం ఎలా నడపగలరు? మా భద్రత సంగతి గాలికొదిలేసి ఆమెతో ముచ్చట్లాడుతుంటే, అవతల మా గుండెలు గల్లంతయిపోయాయి మహాప్రభో!” అని ఒక విమాన ప్రయాణికుడు మొరపెట్టుకొంటే వెంటనే ఆ ఇద్దరు పైలట్లని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసేసారు. ఇంతకీ ఆ కధా కమామిషు ఏమిటంటే, క్రింతటి నెల మన టాలివుడ్ అందాల భామ నిత్య మీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ కి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తూన్నపుడు, ఆ ముద్దు గుమ్మకి అసలు ఇంత పెద్ద విమానాన్ని కేవలం ఇద్దరు మనుషులు ఎలా నడుపుతారో తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అంతే ఆమె నేరుగా కాక్ పిట్ వద్దకు వెళ్లి తలుపు మీద సుతారంగా టక్ టక్మని కొట్టగానే తలుపు తీసి బయటకి తొంగి చూసిన మన కుర్ర పైలట్లు జగన్, కిరణ్ (ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కాదు లెండి)లకి తమ కోసమే ఆకాశం నుండి దిగివచ్చిన (ఆ టైంకి వాళ్ళు కూడా ఆకాశంలోనే ఉన్నారనే సంగతి మరిచిపోయారు) అప్సరసలా తలుపు దగ్గిర నిలబడి, ఓరకంట చూసి నవ్వుతున్న నిత్యా మీనన్ కనబడగానే నిజంగానే వారి గుండెలు జారి గల్లంతయిపోయాయి. ఇంకేముంది, ఆమెను సాదరంగాలోనకి ఆహ్వానించి తమ పక్కన ఖాళీగా ఉన్నసీటులో (ఆ సీటు కేవలం విమాన శిక్షణ ఇచ్చే మాస్టర్లకి, లేదా అటువంటి వారికి మాత్రమే కేటాయించబడింది) కూర్చోబెట్టుకొని, ఆమె తన పెద్దకళ్ళను విప్పార్చి తమవైపే చూస్తుంటే, వారిద్దరూ ఆమెతో ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ అలా అలా గాలిలో తేలిపోతున్నట్లు (విమానమన్నాక గాలిలోనే తేలుతుందని అందరికీ తెలుసు. గానీ, ఆ రోజు మరింత బాగా తేలిపోయిందని ప్రయాణికుల అభిప్రాయం) విమానాన్ని అలవోకగా ఎడం చేత్తో నడిపి చూపించి ఆమె నుండి మరిన్ని ముసిముసి నవ్వులు రాల్చుకొని పరమానందపడిపోయారు మన కుర్ర పైలట్లు ఇద్దరూ. ఆ తరువాత ఆమె హైదరాబాద్ రాగానే వారికి ‘టాటా టాటా బై బై’ చెప్పేసి బ్యాగు ఊపుకొంటూ వెళ్లిపోయింది. అయితే, ఆమె వచ్చి తనపక్కన కూర్చొంటే చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చునని ఆశపడి భంగపడిన ఒక ప్యాసింజరు, ఇదంతా చూసి ఓర్వలేక నేరుగా వెళ్లి బరబరా ఒక పిర్యాదు వ్రాసి పడేసాడు. అంతే ఇంకేముంది? ఇద్దరు కుర్ర పైలట్లని సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు చేతిలో పెట్టేసారు సదరు విమాన సంస్థ వారు. ఇప్పుడు వారిద్దరూ ‘ఎంతపనిచేసావే నిత్యా!’ అంటూ ఆక్రోశిస్తున్నారు పాపం!
http://www.teluguone.com/news/content/nitya-menon-32-24427.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





