తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్!

Publish Date:Jun 29, 2026

Advertisement

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి  ఆ పార్టీ హైకమాండ్   గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ   జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం (జూన్ 28)  అర్ధరాత్రి తెలంగాణ బీజేపీ కీలక నేతలతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా..  గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే చూస్తూ ఊరుకోబోమని కుండబద్దలు కొట్టారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు.  బయటి నుంచి  మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  పశ్చిమ బెంగాల్ లాంటి   రాష్ట్రంలోనే బీజేపీ కేవలం తన సొంత బలంతో, క్షేత్రస్థాయి పోరాటాలతో  ఎదిగి అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పిన నితిన్ నబీన్.. అందుకు భిన్నంగా తెలంగాణలో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నాయకుల అలసత్వం, గ్రూపు రాజకీయాలు, విభేదాల కారణంగా పార్టీ వెనుకబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 రాష్ట్రంలోని ఏ నాయకుడు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్నారో, ఎవరు పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారో అనే పూర్తి వివరాలు, గణాంకాలు  తన వద్ద ఉన్నాయని  నితిన్ నబీన్ చెప్పారు.  రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అలాగే జీహఎచ్ఎంసీ సంస్థల ఎన్నికలను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. 

By
en-us Political News

  
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.